ఆ విషయంలో సమంత సహకరిస్తే ఫుల్ ఖుషి ఖుషి.. ప్లీజ్ ఒప్పుకో సామ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యశోద . ఫస్ట్ టైం సమంత పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ద్వారా మన ముందుకు రాబోతుంది. మరి ముఖ్యంగా సమంత ఈ సినిమాలో సరో గెట్ మదర్ గా కనిపించబోతుంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి అర్థం అయిపోతుంది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల చేశారు.

Samantha's Yashoda Movie Is Being Made Basing A True Incident

ఈ ట్రైలర్ చూసిన జనాలు సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. మరి ముఖ్యంగా సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఫుల్ లెంత్ హీరోయిన్ గా ఫస్ట్ టైం జనాల ముందుకు రాబోతుంది . పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోస్ రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది విజయ్ దేవరకొండ.

Kushi First Look Motion Poster | Vijay Deverakonda | Samantha | Hesham  Abdul Wahab | Shiva Nirvana - YouTube

కాగా విజయ్ దేవరకొండ – సమంత కలిసి త్వరలోనే తెరపై సందడి చేయబోతున్నారు . శివనిర్వాణ డైరెక్షన్లో సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ హీరోగా “ఖుషి” అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే సమంత పలు సినిమాల్లో బిజీగా ఉండే ఉండడం వల్ల ఈ సినిమాకి కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేకపోతుందట. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇంకొక్క షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటే పూర్తిగా ప్యాకప్ చెప్పేసి జనాల ముందుకు రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నారు మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 23 డిసెంబర్ 2022 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ .

అయితే విజయ్ దేవరకొండ కోసం కాల్ షీట్స్ విషయంలో సమంత కొంచెం సహకరిస్తే ఆయన కెరియర్ దారిలోకి వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ తన పరువు తానే తీసుకున్నాడు . ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ఒకవేళ ఖుషి సినిమా హిట్ అయితే మళ్లీ ఆయన పూర్వ వైభవం అందుకుంటాడు . చూడాలి మరి సమంత.. విజయ్ దేవరకొండ కోసం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..?