తెలుగు ఇండస్ట్రీలో నే ఫస్ట్ టైం.. అలాంటి ముద్దు పెట్టబోతున్న హీరో రామ్ ..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరో రాం కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్ లాస్ట్ గా నటించిన మూవీ” ది వారియర్”. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ నటనకు మైనస్ మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాలో ఆయన కృత్తితో చేసిన రొమాన్స్ అసలు వర్క్ అవుట్ అవ్వలేదు.

Ram Pothineni remuneration for Boyapati Srinu film

ఈ క్రమంలోనే తన ఆశలు అన్ని నెక్స్ట్ సినిమాపై పెట్టుకున్నాడు. కాగా ఎనర్జిటిక్ హీరో రామ్ తన తదుపరి సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాడు హీరో రామ్ . కాగా ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉండబోతుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్ వైరల్ గా మారింది .

Ram readying for a sizzling song | cinejosh.com

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో రామ్ తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వసి రౌతేలా ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఎప్పుడు లేని విధంగా ఈ సాంగ్లో బోయపాటి శ్రీను ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో హీరో హీరోయిన్ కి లిప్ లాక్ పెట్టేలా ప్లాన్ చేశాడట . దీంతో ఒక్కసారిగా రామ్- బోయపాటి సినిమా న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ సినిమాలో రామ్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా తమన్ సంగీతం మారనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ సర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.