షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..సుదీప రెమ్యునరేషన్ లో 30% కోత..ఎందుకంటే..?

భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. అడిగిమరీ హగ్గులు ఇప్పించుకునే అబ్బాయిలు ఎక్కువైపోయారు . అంతేకాదు హౌస్ లో ఉండాలంటే ఇలాంటివి చేస్తేనే మేలు అంటూ అమ్మాయిలు కూడా సరే అబ్బాయిలకు ఏం మాత్రం తీసిపోని విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా బిగ్ బాస్ షో నుండి సుదీప ఎలిమినేట్ అయింది . మనకు తెలిసిందే హౌస్ లో సుదీప ఎంటర్ అయినప్పుడు కచ్చితంగా ఈమె ఫైనల్ టాప్ ఫైవ్ లిస్టులో ఉంటుందని అంత అనుకున్నారు .

అలాంటి ఓరేంజ్ ఈమెకు బయట ఉంది. అయితే ఫ్యామిలీని మిస్ అవుతుందో.. లేక బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదో తెలియదు కానీ సుదీప్ కొన్ని రోజుల నుండి డల్ గా ఉంది. టాస్కులలో ఎక్కువుగా ఇన్వాల్వ్ అవ్వలేదు. బిగ్ బాస్ హౌస్ లో సుదీప యాక్టివ్ గా లేకపోవడం.. లేనిపోని విషయాల్లో తల దూర్చడం ..టాస్కుల్లో సరిగ్గా ఆడకపోవడం.. కంటెస్టెంట్లు మధ్య చిచ్చు పెట్టడంతో బయట ఉన్న జనాలు ఈమెకు ఓట్లు తక్కువగా వేశారు. ఈ కారణంగానే సుదీప బిగ్ బాస్ హౌస్ నుండి ఆరోవారం ఎలిమినేట్ అయ్యింది.

కాగా , సుదీప రెమ్యూనరేషన్ కి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఈమె వారానికి 25 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అంటే ఆరు వారాలకు అక్షరాల 1,50,000. అయితే ఇందులో 30% బిగ్ బాస్ ఆమె కు కోత విధించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. దానికి కారణం సుదీప బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు బిగ్ బాస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారట . వాటిని ఆమె ఫాలో అవ్వకుండా సైలెంట్ గా ఉండడంతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆమెకు రెమ్యూనరేషన్ లో కోత విధించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో సుదీప , చంటి లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయి షో ని ఊహకందని విధంగా మార్చేసారు.