అయ్యయ్యో..బెల్లం కాస్త అల్లం అయ్యిందే.. మొదటి సినిమాలోనే అలాంటి తప్పు ఎలా చేసావ్ రా అబ్బాయ్..? ..!?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న హీరోలు సరిపోదు అన్నట్టు కొత్త హీరోలు ఎక్కువమంది వస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పేరును ఉపయోగించుకుంటూ చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ క్రమం లోనే బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి స్టార్ అయిపోదామని వచ్చాడు . అయితే ఆ హీరో స్టార్ అయ్యాడా జీరో అయ్యాడా..? తన మొదటి సినిమాతోనే చెప్పేశారు జనాలు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఎక్కడ తెలుసుకుందాం..!!

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి సెకండ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు గణేష్. బెల్లంకొండ గణేష్ డెబ్యు హీరోగా నటించిన సినిమా “స్వాతిముత్యం”. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . మొదట ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు గణేష్ సాహసానికి కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాలి. బిగ్గెస్ట్ హీరోస్ అయినా చిరంజీవి – నాగార్జున నటించిన సినిమాలు “గాడ్ ఫాదర్- ది ఘోస్ట్ “..ఇదే రోజున థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయని ఎప్పుడో ప్రకటించారు. అయినా కానీ స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ మొదటి సినిమాతోనే తనలోని ధైర్యాన్ని సినీ ఇండస్ట్రీకి తెలిసేలా చేసుకోవచ్చాడు ఈ బెల్లంకొండ బాబు.

కధ పరంగా చూసుకుంటే డైరెక్టర్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. కామన్ స్టోరీనే.. రొటీన్ గా ఉండే సీన్స్ నే.. కానీ మధ్య మధ్యలో తనదైన స్టైల్ లో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది అన్న వే లో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. మరి ముఖ్యంగా సినిమాకు హీరోయిన్ వర్ష ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సురేఖ వాణి, ప్రగతి , నరేష్ లాంటి నటీనటులు తమదైన స్టైల్ నటించి సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చారు. ఒక్క లైన్ లో చెప్పాలంటే స్టోరీ మొత్తం హీరో ఫ్రెండ్ బలవంతంగా అతని దగ్గర స్పెర్మ్ డొనేట్ చేయించడం.. ఆ కారణంగా అతని లైఫ్ ఎలా చిక్కుల్లో పడింది.. ఫైనల్లీ తన నిజాయితీని ప్రూవ్ చేసుకున్నాడా లేదా అన్నదే కాన్సెప్ట్.

బెల్లంకొండ గణేష్ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు . అందుకే సినిమా ప్రమోషన్స్ లో కూడా ఓ స్థాయిలో బెల్లంకొండ గణేష్ ని ప్రమోట్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆయన నటనకు డిజాస్టర్ మార్కులు పడ్డాయి. బెల్లంకొండ అనే పేరు వింటేనే సగం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు . అయితే ఎక్స్పెక్టేషన్స్ ని గణేష్ ఫుల్ ఫీల్ చేయలేకపోయాడు అని అంటున్నారు జనాలు. కధపరంగా సినిమా బాగున్నప్పటికీ ..నటనపరంగా హీరోయిన్ మెప్పించినప్పటికీ.. గణేష్ పేరు ఎక్కువ పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిన గణేష్ కు నిరాశే మిగిలింది అంటున్నారు ఫాన్స్ . అంతేకాదు బెల్లంకొండ గణేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టేద్దాం అనుకున్నాడు ..కానీ సినిమా రిలీజ్ అయ్యాక బెల్లం కాస్త అల్లం గా మారింది ..బెల్లంకొండ అబ్బాయిలో అంత మేటర్ లేదు అని తెలిసిపోయింది. దీంతో బెల్లంకొండ గణేష్ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కు గురవుతుంది.