బిగ్ షాకింగ్: కోలీవుడ్ స్టార్ బ్యూటి ఆత్మహత్య..సూసైడ్ లెటర్ లో ఊహించని పేరు..!?

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక మరణ వార్త విని ఆ విషాదం నుండి బయటపడక ముందే మరొక విషాద వార్త సినీ ఇండస్ట్రీ ను కబలిస్తుంది. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఛాయల నుంచి ఇంకా సినీ ఇండస్ట్రీ కోలుకోక ముందే మరో మరణ వార్త సినీ ఇండస్ట్రీను విషాదంలోకి నెట్టేసింది. కోలీవుడ్ స్టార్ బ్యూటీ దీప అలియాస్ పౌలీస్ ఆత్మహత్య చేసుకుని సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

కోలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటిస్తున్న దీప అలియాస్ పౌలీస్ కుర్రకారుని ఫిదా చేస్తుంది. పలు సహాయక పాత్రలో నటించిన ఈమె కోలీవుడ్లో స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. అంతే కాదు హీరోయిన్ కి మించిన అందం ఉంది హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా అంటూ పలువురు పబ్లిక్ గానే అడిగేసిన సందర్భాలు ఉన్నాయి. అంత అందం ఆమె సొంతం. అంతేకాదు నటనలోనూ ఆమె అందర్నీ ఫిదా చేస్తుంది. ఎలాంటి క్యారెక్టర్ లో నైనా సరే ఒదిగిపోయి నటించడం ఆమెలో ఉన్న ప్లస్ పాయింట్. మరి అలాంటి యువనటి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్లో ఉంటున్న ఈమె శనివారం నుండి ఫోన్ ఎత్తకపోవడంతో తన తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది . ఇంతలో అక్కడికి వెళ్లి చూడగా ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె బాడీని హ్యాండోవర్ చేసుకొని పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా అంతవరకు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా ఇలా మరణించడం చూసి తల్లిదండ్రులు షాక్ అయిపోయారు .

అంతేకాదు ఆమె ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టింది ..”అందులో ఆమె నా చావుకు ఎవరు బాధ్యులు కారు అంటూనే తను బ్రతికి ఉన్న చనిపోయిన ఒక వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటానని చెప్పడం ” ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఆమె గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురైందని అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. మరి ఆమె జీవితాంతం ప్రేమిస్తూ ఉంటానని చెప్పిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు . మరి చూడాలి దీనికి ఏమైనా ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందా లేదా మరి ఏదైనా కారణమా అని పోలీసులు విచారిస్తున్నారు.

Share post:

Latest