హవ్వా..ఛీ ఛీ ..ఆడదాని నోట అలాంటి బూతు మాట..గీతూ వీడియో వైరల్..!

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్లోకి అడుగు పెట్టింది బిగ్ బాస్. ఈ సీజన్ 6లో కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గీతు రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఒక యూట్యూబర్ అలాగే గతంలో బిగ్ బాస్ సీజన్ రివ్యూ చేస్తూ పాపులర్ అయింది. అంతేకాకుండా ఇటీవల ఈటీవీ జబర్దస్త్ షోలో కూడా కామెడీ చేస్తూ పాపులర్ అయింది.

ఇటీవల నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ఆటలో ఫైర్ చూపించాలి అనే హౌస్మెంట్స్‌ను హెచ్చరించారు. నాగార్జున అలా అనేసరికి హౌస్ మెంట్లు ఊరుకుంటారా ? రెచ్చిపోయారు. అయితే గలాటా గీత మొదటి రోజు నుంచి ఓవరాక్షన్ చేస్తూ, అతిగా వాగుతుండ‌డంతో నెటిజన్లు సైతం ఈమెను తెగ తిడుతున్నా విషయం అందరికీ తెలిసింది. అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ అబ్బాయిలతో కూడా క‌య్యానికి దిగుతోంది.

గీతతో మాట్లాడాలంటేనే ఇంట్లో కంటెస్టెంట్స్ కూడా భయపడేలా అంద‌రినీ ఆమె భ‌య‌పెట్టేసింది. గీతు మాత్రం టైటిల్ విన్నర్ కావాలని తాను ఎలా ప్రవర్తిస్తుందో హౌస్ లో ఎలా ఉంటుందో తనకే అర్థమవ్వన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తోంది. ఇక అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో బూతులతో రెచ్చిపోతుంది. దానికి నాగార్జున వావ్ అంటూ గీతు అంటూ మెచ్చుకోవడం చప్పట్లు కొట్టడంతో ఆమె బూతులు కోటలు దాటేసాయి.

సాధారణంగా హౌస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా సరే టాస్క్ లో ఏం చేసినా ? సరే పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ.. బిగ్ బాస్ హౌస్ లో వాడే మన మాట, తీరు, నడవ‌డికా ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇక మనం మాట్లాడే మాటలు పట్టే ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలి అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే గీతు మాత్రం ప్రతిసారి ఇనయా మీద ఏదో ఒక పరుష పదాన్ని వ‌దిలేస్తూ ఉంటుంది. ఒక్క ఇనయా ఏం కర్మ అందరితోనూ ఆమె ప్రవర్తన అలానే ఉంటుంది. అందులో ఆమె వాడే పదజాలం రాయడానికి గాని చెప్పడానికి గాని వీలు లేకుండా ఉన్నట్టుంటుంది.

అలాంటి పదాలతో రెచ్చిపోతూ మరింత ఓవరాక్షన్ చేస్తూ గీతూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇనాయనాను దొబ్బెయ్ అనేసింది. మరి బిగ్ బాస్ ఎడిటర్లకి ఈ విషయం అర్థమైందో లేదో తెలీదుగానీ.. ఇలాంటి పదాలను టెలికాస్ట్ చేస్తున్నారు.. లేక వారికి అలాంటి కంటెంటే కావాలి అనుకుంటున్నారో అని చూసిన ప్రేక్షకులు మాత్రం అలాంటి పదజాలం వాడడం తప్పు అని అవి పైగా మీరు టెలికాస్ట్ చేయడం ఇంకా పెద్ద తప్పు అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Share post:

Latest