కృతి శెట్టి పేరు పై కళ్లు చెదిరే ప్రాపర్టీస్.. టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

అందాల భామ కృతి శెట్టి.. సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనల వచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తన అందచందాలతో సినీ లవర్స్ ని ముంచెత్తింది . అంతేనా సీనియర్ బ్యూటీలకు సైతం అందం విషయంలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు.. కానీ, వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకొని హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

 

సీన్ కట్ చేస్తే.. మిగిలిన మూడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కృతి శెట్టి కొంచెం అప్ సెట్ అయిందని చెప్పాలి. కాగా ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఆమె తన 19వ పుట్టినరోజుని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. దీంతో ఆమె గురించి సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీకి వచ్చి కృతశెట్టి చాలా తక్కువ కాలమే అయింది. అయినా కానీ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రినీ షేక్ చేసింది.

ఆమె మొదటి సినిమాకే కోటి రూపాయలు పారితోషకం తీసుకుని సంచలన రికార్డును క్రియేట్ చేసింది. ఇక తర్వాత వచ్చిన రెండు సినిమాలకు కూడా కృతిశెట్టి రెండు కోట్లకు తక్కువ తీసుకోలేదు అంటూ వార్తలు వినిపించాయి. కాగా ప్రజెంట్ ఇప్పుడు కృతిశెట్టి పేరుపై ఉన్న ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుతున్న సమాచార ప్రకారం కృతి శెట్టి టోటల్ ఆస్తి 50 కోట్లకు పైగానే ఉంటుందంటూ తెలుస్తుంది.

అంతేకాదు కృత్తిశెట్టి కి 50 లక్షల విలువైన ఆడి ఏ4, 35 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూన్. 20 లక్షల విలువైన హోండై కార్లు.. ఉన్నట్టు తెలుస్తుంది . అంతేకాదు ముంబై , బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో ఫ్లాట్లు ఇల్లులు కూడా ఉన్నాయట . అవే కాకుండా కృతి శెట్టికి బోలెడంత బంగారం తీసి పెట్టిందట అమ్మగారు. ఓవర్ ఆల్ గా కృతి శెట్టి ఆస్తులు సుమారు 50 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Latest