ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా హీరోయిన్స్ ను మించిపోయే అందాలు ఉన్న బ్యూటీస్ కనిపిస్తున్నారు. వెండితెర పై అయితే మూడు గంటలే అదే బుల్లితెరపై ..సీరియల్లో పలు ఈవెంట్స్ ద్వారా రోజు పలకరిస్తూ ఉండచ్చు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని బుల్లితెరపై తనకంటూ చెరగని ముద్రను వేసుకున్న హాట్ బ్యూటీ శ్రీముఖి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని చానల్స్ లో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై తనదైన స్టైల్ లో రాణిస్తున్న ఈ రాములమ్మ గురించి అందరికీ తెలిసిందే.
సినిమాలో పలు రోల్స్ చేసి నటించి మెప్పించిన శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా తిరుగులేని మార్పు అందుకుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఆటోబాంబ్ ..సెట్ అంతా ఎనర్జీతో చెలరేగిపోతుంది . వల్గర్ డైలాగ్స్ అయినా హాట్ ఫుల్ వర్డ్స్ అయినా ఏదైనా చెప్పడంలో ఎలాంటి పర్ఫామెన్స్ లో అయినా చేయడంలో శ్రీముఖి తర్వాత ఎవరైనా. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత శ్రీముఖి యాంకరింగ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. ఏ విషయం లో నైన బోల్డ్ గా ఉండటం.. బోల్డ్ ఫోటో షూట్స్ చేయడం..బోల్డ్ అనే పదానికే కొత్త నిర్వచనం తీసుకువచ్చింది.
కాగా తనకంటూ ఓ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బుల్లితెర డిటైల్స్, ఈవెంట్స్, అందాల సీక్రెట్స్, హోమ్ టూర్, తనకొచ్చిన వంటలు తను చేసే వ్యాయామాలు ..తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో బుల్లితెర పై ఖచ్చితంగా అమ్మాయిలకు మేకప్ చాలా ఇంపార్టెంట్. అన్నం తినకుండా ఉండే హీరో, హీరోయిన్స్ , యాంకర్స్ ఉన్నారేమో కానీ మేకప్ వేసుకొని హీరోయిన్స్ ఎవరూ లేరు . అయితే ఈ రాములమ్మ మాత్రం ఇంట్లో ఉంటే అస్సలు మేకప్ వేసుకోదట .నాచురల్ లుక్ తోనే ఆకట్టుకుంటుందట అంతేకాదు.. యూట్యూబ్ లో తను పెట్టే ప్రతి వీడియోలోను ఆమె నాచురల్ లుక్స్ లోనే ఉంటుందట. షూటింగ్ స్పాట్లో తప్పిస్తే ఈవెంట్లు తప్పిస్తే మిగతా ఎక్కడికెళ్ళినా కానీ ఇంట్లో ఉన్న టైంలో కానీ టెంపుల్ కి వెళ్లే టైం లో కానీ శ్రీముఖి నాచురల్ గానే ఉంటుందట. మేకప్ వేసుకోవడానికి అసలు ఇష్టపడదట . దీంతో శ్రీముఖి అందాలకు సంబంధించిన సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.