త‌ల్లి ఇందిర‌పై మ‌హేష్‌కు ఎంత ప్రేమంటే… ఇంత‌క‌న్నాసాక్ష్యం కావాలా…!

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. అలాగే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం వార్త అభిమానులను ఎంతగానో బాధపెడుతుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి వారి స్వగృహంలో మృతి చెందారు. ఆమె మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా నివేదికగా వారి సంతాపం తెలియజేస్తున్నారు. తల్లి మరణ వార్త విన్న మహేష్ బాబు బాధతో కృంగిపోయారు.

ఇందిరాదేవి మహేష్ బాబుని `నాని` అని పిలిచేవారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తల్లి ప్రస్తావన రాగానే బాగా ఎమోషనల్ అయ్యారడు. అయితే ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబుకి త‌న‌ తల్లి అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. చివ‌ర‌కు ఇదే నాని పేరుతో మ‌హేష్ ఓ సినిమా కూడా చేశాడు. కృష్ణ కి ఇందిరాదేవి వారి మామ కూతురు అట. ఇక కృష్ణగారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు సూచనల మేరకు ఇందిరా దేవిని మొదటి పెళ్లి చేసుకోవడం జరిగింది.

ఆ తరువాత ఆయన రెండో పెళ్లి చేసుకోగా.. ఇక ఇందిరా దేవి అరుదుగా మాత్రమే బయట కనపడే వారు. ఇటీవల ఏప్రిల్ 20వ తేదీన ఇందిరా దేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆరోజు మహేష్ సోషల్ మీడియా వేదికగా వారి అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ `అమ్మ మీరు నా తల్లి కావడం అదృష్టమని`.. నీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదని చెప్పారు. ఇక ఆ ట్వీట్లో ఎప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉంటానని కూడా పేర్కొన్నారు. ఇక మహేష్ బాబు తన తల్లి మీద ఉన్న ప్రేమను ఆ ట్వీట్ ద్వారా బయటపెట్టారు.