మ‌హేష్ ఇంట్లో దొంగ‌త‌నానికి దూరిన వ్య‌క్తి ఎవ‌రు… అస‌లేం జ‌రిగింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యలతో మరణించార‌న్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే ఇందిరా దేవి మరణం వార్త‌ మహేష్ బాబు ఫ్యామిలీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఓ పక్క ఇందిరా దేవి చనిపోయిన బాధలో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ఉంటే మరో పక్క మహేష్ బాబు ఇంటికే దొంగతనం చేసేందుకు ఒకడు ప్రయత్నించాడు.

ప్రయత్నించడమే కాదు మహేష్ ఇంటి గోడ దాటి అవతలి వైపు వరకు వెళ్ళాడు. ప్రస్తుతం మహేష్ బాబు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లావిష్ ఇల్లు కట్టుకుని ఫ్యామిలీతో అక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే కృష్ణ ఇంటికి వెళ్తున్నాడు. గత నాలుగు రోజుల నుంచి మహేష్ తల్లి ఇందిరా దేవి అనారోగ్య పాలవడంతో మహేష్ అండ్ ఫ్యామిలీ ఆమె దగ్గరే ఉంటున్నారు. తాజాగా ఆమె మరణించడంతో కృష్ణ ఇంటి దగ్గరే ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి కృష్ణ అనే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మహేష్ బాబు నివాసానికి దొంగతనం చేయడానికి వెళ్ళాడు.

మహేష్ బాబు ఇంటికి 10 అడుగులకు పైగా ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. ఇక ఆ దొంగ అంత ఎత్తు నుండి గోడ దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇక ఆ వ్యక్తి దూకిన శబ్దానికి అక్కడి సెక్యూరిటీ గార్డులు చూసి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మహేష్ బాబు నివాసానికి వచ్చి ఆ దొంగని ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పోలీసులు కృష్ణ అని వివరించగా ఒడిశా నుండి అతను మూడు రోజుల క్రితం హైదరాబాదుకి వచ్చినట్టు చెప్పాడు.

మహేష్ బాబు ఇంటి కి ద‌గ్గ‌ర‌లో ఉన్న మొక్కల నర్సిరీలో పనిచేస్తున్నట్టు సమాచారం ఇచ్చాడు. ఇక ఆ వ్యక్తి కోలుకున్నాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు. ఇక దీంతో ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మహేష్ బాబు ఇంట్లోకి చొరబడ్డాడు? ఆ వ్యక్తి దొంగతనం కోసమే వచ్చాడా? లేక ఇంకే వేరే ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే హాస్పిటల్లో ఉన్న కృష్ణ అనే వ్యక్తి కోలుకోవాలి.