లైగర్ సినిమా దెబ్బకు అలాంటి నిర్ణయం తీసుకున్న ఛార్మి.. ఏమిటంటే..!!

హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రంగా నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. నిర్మాతగా కరణ్ జోహార్, ఛార్మి, పూరి కూడా వ్యవహరించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈ సినిమాని సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేయడం జరుగుతోంది. గతంలో సినిమా ప్రమోషన్లలో చిత్ర బంధం చెప్పిన మాటలు వారి స్టేట్మెంట్లను బయటకు తీసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై ఛార్మి ఒక ట్వీట్ చేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.Charmy Kaur Bio, Movies, Height, Weight, Husband Name, Age & Image - info  Knocksఅలా నెటిజన్ల, ట్రోలర్స్ దెబ్బకు విసిగిపోయిన ఛార్మి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.నిన్నటి రోజున ట్రోలర్స్ కు సమాధానం చెబుతూనే తన నిర్ణయాన్ని కూడా తెలియజేసింది. ఆ ట్వీట్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఛార్మి ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలనే నిర్ణయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.Vijay Deverakonda, Ananya Panday pose with Mike Tyson while shooting for  Liger in the US | Hindustan Times

కొంత బ్రేక్ తిరిగి రెట్టింపు ఉత్సాహంతో వస్తాను అంటూ చెప్పుకొచ్చింది .అంతేకాకుండా బతకండి బతకనివ్వండి అంటూ గట్టిగానే కౌంటర్ వేసినట్లుగా తెలుస్తోంది.. చార్మి ట్వీట్ లో ఏం రాసింది అంటే..”దిల్ గాయస్ కాస్త .. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాను అప్పటివరకు బతకండి..బతకనివ్వండి అంటూ ఛార్మి ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త చాలా వైరల్ గా మారుతుంది. దీంతో పలు రకాల నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది విజయ్ దేవరకొండ తో నెక్స్ట్ సినిమా ఎప్పుడు అనే విషయాన్ని కూడా అడుగుతూ ఉన్నారు.

https://twitter.com/Charmmeofficial/status/1566301052445806592?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1566301052445806592%7Ctwgr%5Eb306c3be7bcdc969eccc3a948262803d82c113d2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fsumantv.com%2Fmovies%2Fcharmi-kaur-took-a-break-from-social-media-195956.html