మెగాస్టార్ ఇంటి నుండి మరో హీరోయిన్.. ఈ వయసులో ఇదేం ట్వీస్ట్ రా బాబు..!?

వామ్మో మెగాస్టార్ ఇంటి నుండి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారా..? ఏంటి టోటల్ మెగాస్టార్ కుటుంబమే సినిమా ఇండస్ట్రీని ఏలేయాలి అనుకుంటుందా..? మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా..? తొక్కేస్తారా..? ఏంటి సార్ ఇది..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మెగాస్టార్ ఇంటి నుండి మరో వ్యక్తి సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారట . దీంతో మొదటే మెగా ఫ్యామిలీని ట్రోల్ చేసే వాళ్ళకి మరో పెద్ద అవకాశం ఇచ్చినట్లు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..


మనకు తెలిసిందే మెగాస్టార్ పేరు చెప్పుకొని ఇప్పటికే సగం మందికి పైగా మెగా హీరోలు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయ్యారు. కొందరు సక్సెస్ అయ్యారు.. కొందరు ఫ్లాప్ అయ్యారు.. కొందరు సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు.. ఏది ఏమైనా మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోల అందరిలో సగానికి సగం మెగా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి ఎంట్రీ ఇస్తుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ పెద్ద కూతురు నివృతి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరే నివృతి. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ పాప ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నివృత్తిని చూసిన డైరెక్టర్ శంకర్ తన మామ సినిమాలోనే అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శంకర్ చరణ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ పాత్రలో ఆమె మెరవనున్నట్లు సమాచారం. ఋఛ్15 సినిమాలో నివృతి ఓ స్పెషల్ రోల్ లో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవిని శంకర్ సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు.. నివృత్తికి కూడా సినీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లు అందుకే ఆమె ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి నివృతి తన యాక్టింగ్ తో ఎలా మెప్పిస్తుందో ..? అయితే ఇంత చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి రావడం అవసరమా అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest