శ్రీముఖి వేసుకున్నీఈ బ‌ట్ట‌ల‌పై మామూలు ట్రోలింగ్ కాదుగా…!

శ్రీముఖి ఒక ప్రముఖ బుల్లితెర బ్యూటీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. శ్రీముఖి సినిమాల్లోకి రాక‌ముందు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేసి తన మాటలతో, అల్లర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `జులాయి` సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా న‌టించింది.

ఆ తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. అలా బుల్లితెర రంగంలో తనదైన యాంకరింగ్‌తో దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీముఖికి బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్ళింది. అందులో టైటిల్ కోసం పోరాడి చివ‌రికి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

అయితే, ఈ షోలో గెలవకున్నా తన క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు పైగా వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అయితే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎన్నో రకాలుగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

ఇక రోజు తన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది. అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తు తన డాన్స్ వీడియో లను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. ఇక తాను రీసెంట్ గా చేయించుకున్న ఫోటో షూట్ లో హాట్ ఫోజులతో పిక్స్ సోషల్ మీడియాలో ఆ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఆ ఫోటోలను చూసిన నెటిజ‌న్లు ఏంటీ ఈ బ‌ట్టలు అని ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేసారు.

Share post:

Latest