ఓ రేంజ్ లో రెచ్చిపోయిన అమలా పాల్.. బీచ్ లో గ్లామర్ షో..

గ్లామర్ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండా పై కపిరాజు, మేము, ఆమె చిత్రాల్లో నటించింది. అప్పటి నుంచి తెలుగులో సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఇతర భాషల చిత్రాల్లో బిజీగా ఉంటుంది. అమలాపాల్ తన నటనతోనే కాకుండా గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

2014లో అమలాపాల్ దర్శకుడు ఏఎల్.విజయ్ ని పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకే విభేదాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయ్యింది. ప్రస్తుతం తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అమలాపాల్ తన పాత్రకు ప్రాధన్యత ఉంటే ఎంతటి బోల్డ్ రోల్ అయినా ఓకే చెప్పేస్తోంది..ఆడై సినిమాలో అమలా పాల్ న్యూడ్ గా కూడా నటించింది. ఆ చిత్రం తెలుగు ‘ఆమె’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంది..

అమలాపాల్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటో షూట్ లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారకు కునుకు లేకుండా చేస్తోంది.. రీల్ లైఫ్ లో ఎంత బోల్డ్ గా నటిస్తుందో.. రియల్ లైఫ్ లోనూ బోల్డ్ గా కనిపించి రెచ్చిపోతుంది. తాజాగా అమలా పాల్ సముద్రపు ఒడ్డున హాట్ ట్రీట్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఆమె మాల్దీవుల్లో వెకేషన్ లో ఉంది. అక్కడ తన అందాలను యథేచ్ఛగా ఆరబోస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా, అమలా పాల్ కెరీర్ లో కాంట్రవర్సీలు ఎక్కువ. ఆమె సినిమాల కంటే పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటుంది.

Share post:

Latest