సైలెంట్ షాకిచ్చిన అల్లు అర్జున్..ఈ న్యూస్ తెలిస్తే అభిమానులు తట్టుకోగలరా..!?

అల్లు అర్జున్.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందుపుచ్చుకుని.. సినీ ఇండస్ట్రీలోకి నటుడుగా ఎంటర్ అయిన అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరో లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు. మొదట డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన అది అల్లు అర్జున్ హీరోగా ఎంటర్ అయ్యారని మాత్రం చెప్పలేం. అల్లు అర్జున్ మొదటిగా హీరోగా నటించిన చిత్రం గంగోత్రి. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన డాన్స్ పర్ఫామెన్స్ ఎలా ఉందో మనకు తెలిసిందే.

ఇక తర్వాత వరుసగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ తన డాన్స్ ని.. ఆయుధంగా మార్చుకుంటూ సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేసాడు. ఒకానొక టైం లో బిగ్ స్టార్స్ కూడా అల్లు అర్జున్ సినిమా వస్తుంది అంటే భయపడిపోయే రోజులు మనం చూసాం. ప్రజెంట్ కూడా అదే పొజిషన్లో ఉంది కెరియర్ లో ఒకానొక వరుస ప్లాప్ సినిమాలతో గ్యాప్ పడిన ఆ తర్వాత మళ్లీ బ్లాక్ బస్టర్ హీట్లతో బౌన్స్ బ్యాక్ అవుతూ సూపర్ హిట్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన బన్నీ ..త్వరలోనే పుష్ప2 షూటింగ్లో పాల్గొనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 10 నుంచి పుష్ప2 సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా ఎలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటాడా అని అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెరపైకి కొందరు బోయపాటి శ్రీను అని మరికొందరు వేణు ఉడుగుల అని.. మరికొందరు అనిల్ రావిపూడి అని.. ఇంకొందరు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అని.. ఇలా ఎంతోమంది డైరెక్టర్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేది మాత్రం తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో అంటూ ఓ క్రేజీ న్యూస్ సినీవర్గాల నుంచి అందుతుంది. ఇప్పటికే బన్నీకి అట్లీ కుమార్ కథ చెప్పడం ఆయనకు తెగ నచ్చేసి సైన్ కూడా చేయడం జరిగిపోయాయట. పుష్ప సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేసి ఈ సినిమాను కూడా సెట్స్ పైకి కి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట బన్నీ. మరి చూడాలి అట్లీ డైరెక్షన్లో మాస్ హీరో బన్నీ ఏ రేంజ్ లో క్లాస్ హిట్ కొడతాడో..?