దసరా పండుగ రోజున అదిరిపోయి అప్డేట్ ప్రకటించిన నాని..!!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ ప్రతి ఒక్కరు దృష్టిని తన వైపు తిప్పుకున్నాడని చెప్పవచ్చు. చివరిగా నాని శ్యామ్ సింగ్ రాయ్ సినిమా సక్సెస్ కావడం జరిగింది.ఇక తర్వాత నటించిన సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.

Spark of #Dasara | Nani | Keerthy Suresh | Srikanth Odela | Sudhakar  Cherukuri - YouTube
ఇక గతంలో నేను లోకల్ వంటి చిత్రంతో నాని, కీర్తి సురేష్ ఇద్దరు నటించడం జరిగింది. ఇక దాని తర్వాత దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకి షూటింగ్ గత సంవత్సరం మొదలైనప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నాని.. అందుచేతనే దసరా కానుకగా దసరా సినిమాకు సంబంధించి అప్డేట్ను ఇవ్వబోతున్నట్లు తాజాగా తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు నాని. ప్రత్యేకంగా రూపొందించిన ఒక వీడియోలో నాని ఈ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో సిల్క్ స్మిత పోస్టరు హైలెట్ గా మారినట్లు తెలుస్తోంది.