నాతో రొ**న్స్ చేయడానికి ఆ హీరో ఇబ్బందిపడ్డాడు.. తేజస్వి మదివాడ..!

అందం.. అభినయం మాత్రమే కాదు.. ఉత్సాహం.. హుషారు కూడా ఈమెను చూస్తే కుళ్ళుకోవాల్సిందే.. కష్టం వచ్చినా .. నష్టాలు ఎదురైనా .. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. తనలో ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఎప్పటికప్పుడు తనలో కొత్త భావాన్ని నింపుకుంటూ ముందడుగు వేస్తున్న తేజస్వి మదివాడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గలగల మాట్లాడే ఈ బ్యూటీ వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా మలుచుకుంటూ తన కెరియర్ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇకపోతే హీరోయిన్గా అవకాశాలు వచ్చినపుడు వాటిని చేస్తూనే ఆ అవకాశాలు సన్నగిల్లినప్పుడు రియాల్టీ షోలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు అని చెప్పవచ్చు..I thought I was losing my identity, says Tejaswi Madivada

ఇకపోతే తాజాగా తాను నటించిన చిత్రం కమిట్మెంట్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా హాట్ గా ఉండడంతో పాటు బోల్డ్ గా కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక సినిమాకు ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి అని.. బోల్డ్ సన్నివేశాలైనా.. కిస్ సన్నివేశాల నైనా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానంటూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. తాజాగా తాను నటించిన కమిట్మెంట్ సినిమాలో రొమాన్స్ ఉంటుందని.. శ్రీనాథ్ తనతో రొమాన్స్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అని ఆమె చెప్పుకొచ్చింది.Tejaswi Madivada: కమిట్‌మెంట్ కోసం కామన్ అంటున్న ఐస్ క్రీమ్ పాప తేజస్వి  మదివాడ..ఇక అంతే కాదు ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో తనను కమిట్మెంట్ కోరలేదు అని.. తనకు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదంటూ కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు తనను కమిట్మెంట్ అడగాలంటే భయపడే వాళ్ళని కూడా చెప్పుకొచ్చింది. నిజానికి ఈమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిలో చాలావరకు అక్క, చెల్లి పాత్రలు మాత్రమే వస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈమె కోసం బోల్డ్ క్యారెక్టర్లు తీసుకొస్తున్నారు కానీ కేరింత సినిమాలో లాగా పాత్రలు రావట్లేదు అని చెప్పకు వచ్చింది. ఇక సినిమాలు మానేసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి పెడుతున్నారని కూడా చెప్పింది. ఇక అంతే కాదు బిగ్ బాస్ ద్వారా కొత్త ఇల్లు, కార్ కొనుక్కొని చాలా హ్యాపీగా ఉన్నాను అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest