గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత..అభిమానులు పిచ్చ హ్యాపీ..!!

సునీత.. టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరిగా ఫేమస్ అయిన సింగర్. సునీత పాటలు అంటే చాలామందికి ఇష్టం. ఎంత చక్కగా పాటలు పాడుతుందో అంతే చక్కగా ఉంటుంది. తెలుగింటి అమ్మాయిల చక్కగా రెడీ అవుతుంది. నో ఎక్స్పోజింగ్, నో వల్గారిటి, నో హర్టింగ్.. ఈ మూడు సునీత ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. సునీత పాట అంటే నచ్చని జనాభా ఉండరు. సునీత గొంతు లో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఆమె పాట పాడితే చాలా తియ్యగా ఉంటుంది.. వినాలనిపిస్తుంది అంటుంటారు జనాభా. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత అభిమానులతో ఎప్పుడు ముచ్చటిస్తూనే ఉంటుంది.

మనకు తెలిసిందే సింగర్ సునీత ది చైల్డ్ మ్యారేజ్. చిన్నతనంలోనే ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తలైంది. ఆ తర్వాత కొన్ని కారణాలు చేత ఆమె ఆయనకు విడాకులు ఇచ్చి.. ఈ మధ్యనే మ్యాంగో మీడియా అధినేత రామ్ ని పెళ్లి చేసుకొని మరొ కొత్త జీవితం ప్రారంభించింది. కాగా రామ్ ని పెళ్లి చేసుకున్న సునీత చాలా మారిపోయింది. తను పోగొట్టుకున్న సంతోషాలన్నింటిని మళ్లీ తిరిగి దక్కించుకుంటుంది. తను మిస్సైన ఆనందాలని ఇప్పుడు చిన్న వయసులో చేయలేని పనులు ఇప్పుడు చేసి ఆనందపడుతుంది.

కాగా సునీత ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. ఆమె గొంతు వినాలని ఎంతోమంది లక్షల సంఖ్యలో ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా రీసెంట్ గా వాళ్ళకి గుడ్ న్యూస్ వినిపించింది సునీత. ఆమె సోషల్ మీడియాలో వన్ మినిట్ రీల్ చేస్తానని మాట ఇచ్చింది. ఒకవైపు సునీత సింగర్ గా చేస్తూనే మరోవైపు పలు రియాలిటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సునీత.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పాటలతో అభిమానుల్ని ఉత్సాహపరిచే సునిత ఇక పై వన్ మినిట్ వీడియో రిలీజ్ చేస్తానని చెప్పడంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఉన్నారు. సునీత ఏ పాట పాడిన అద్భుతంగానే ఉంటుందని ఆ పాటకే ప్రాణం పోస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే సునీత మూడు వేలకు పైగా పాటలు పాడింది. రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉండే సునీత కోట్లకు అధిపతురాలు.

Share post:

Latest