స్టార్ డాటర్ షాకింగ్ డెసీషన్..కన్నీరు పెట్టుకున్న తండ్రి..!?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు ..వాళ్ళ డాటర్స్ కి కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమ నటనతో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ లెజెండ్ హీరోస్ వాళ్ళ కూతుర్లు అంటే సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. కోలీవుడ్ స్టార్ లెజెండ్ హీరో రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి ఓ చెరగని ముద్రను ఆయన ఇండస్ట్రీలో వేసుకున్నాడు. రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. ప్రజాసేవ అంటూ సంపాదించిన దాంతో సగం డబ్బులు జనాలకే ఖర్చు చేశారు. అంత మంచి మనసున్న హీరో రజనీకాంత్ కన్నీరు పెట్టుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు బాధపడిపోతున్నారు. ఇంతకీ రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకునే అంత సమస్య ఏమొచ్చిందనేగా మీ డౌటు. దానికి కారణం ఆయన కూతురు ఐశ్వర్య అంటూ కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఐశ్వర్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటూ తన తండ్రి పేరును వాడుకుంటూ సినీ ఇండస్ట్రీలో కాలుమోపింది. సినీ పరంగా ఐశ్వర్య ను తప్పు పట్టే విషయం ఏమీ లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఐశ్వర్య చేసిన తప్పులు వాళ్ళ నాన్న రజనీకాంత్ మెడకు చుట్టుకుంటున్నాయి.

ఈ మధ్యనే ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లు పెళ్లి చేసుకొని దాదాపు 17 ఏళ్ళు గడిచాయి. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. చూడ చక్కటి జంట విడాకులు తీసుకోవడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు. వీళ్ళ విడాకులకి సరైన కారణం ఇప్పటివరకు తెలియకపోయినా .. ఐశ్వర్య కు కోలీవుడ్ ఒకప్పటి సార్ హీరోతో ఎఫైర్ ఉందంటూ అందుకే ధనుష్ ఆమెను వదిలేసాడంటూ బలంగా వినిపిస్తుంది. అయితే విడాకులు తర్వాత రజనీకాంత్ ఐశ్వర్య కు మరో పెళ్లి చేయడానికి చాలా ట్రై చేస్తున్నారట.

 

కానీ ఐశ్వర్య మాత్రం.. రెండో పెళ్లి చేసుకోనని ముఖం మీద చెప్పడమే కాకుండా తాను రెండో పెళ్లి చేసుకోవాలి అని మీరు కోరుకోవడం కరెక్ట్ కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిందట. “నా జీవితం ఇకపై సింగల్ గానే ఉంటుంది. నేను నా బిడ్డల కోసమే బతుకుతాను.. నా లైఫ్ లో మరొకరికి చోటు లేదు” అంటూ ఎమోషనల్ గా ఐశ్వర్య చెప్పడంతో.. ఇక కూతురు జీవితం సింగల్ గానే మిగిలిపోతుందా అంటూ రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు”.. అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది దీంతో రజనీకాంత్ అభిమానులు సైతం బాధపడుతున్నారు.