నాగార్జునకు అంత సీన్ లేదు.. అత్యంత దారుణంగా అవమానించిన సమంత.. అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో పరిచయమైన వీరు ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరు కారణం చెప్పకుండా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. అంతేకాదు అటు నాగార్జున , ఇటు సినీ పెద్దలు ఎంతోమంది నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. వీరు వినకపోవడం గమనార్హం.. ఇకపోతే నాగచైతన్య వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కొంతమంది వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని కూడా స్పష్టం చేసింది సమంత.Chaitu and Samantha expecting their first child?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత గొప్ప కుటుంబంగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని కుటుంబానికి ఇంటి కోడలుగా అడుగుపెట్టి చివరకు విడిపోయి ఆ కుటుంబం పైన సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఈ క్రమంలోని తన మామ నాగార్జునను ఉద్దేశించి సమంత చేసిన వ్యాఖ్యలు చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పాలి.. నిజానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి అలాగే ఆ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు, ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు ఉంది. పైగా ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలు ఉన్న హీరోగా కూడా నాగార్జున గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి నాగార్జునను సమంత ఘోరంగా అవమానించింది.Secret behind Sam and Chaitu's tattoos revealed! || Secret behind Sam and  Chaitu's tattoos revealed!

ఇదిలా ఉండగా నాగచైతన్య – సమంత విడిపోవాలని అనుకున్నప్పుడు.. నాగార్జున వారి మధ్య సయోధ్య కుదిరించడానికి ఎంతగానో ప్రయత్నించారు.. వీరిద్దరూ వేరువేరుగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న నాగార్జున వీరిద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోని సమంతకు ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదట. మరొకసారి కాల్ చేసినా కూడా పట్టించుకోలేదట. ఇక అప్పుడు పక్కనే ఉన్న ఓ టాలీవుడ్ హీరో లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని చెప్పగా.. ఆయనకు ఇంట్లో అంత సీన్ లేదు.. భార్య చెప్పినట్టే వింటాడు.. ఆయనతో మాట్లాడి వేస్ట్ అని అందరూ ముందే అనేసిందట. ఇక ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ అక్కినేని అభిమానులు మాత్రం సమంతా పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Share post:

Latest