ఆ ఇద్దరి డ్యాన్స్‏కు ఫిదా అయిన మహేష్ బాబు… నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేసాడుగా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ తెలుగు సినిమా ముద్దుబిడ్డ అని చెప్పుకోవాలి. అతను సినిమా జీవితంలో ఎంత పక్కాగా వుంటారో… పర్సనల్ లైఫ్ లో కూడా అంతే పక్కాగా వుంటారు. తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ఇటీవలే పలు యాడ్ షూట్స్ లోనూ పాల్గొంటున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రిన్స్ లేటేస్ట్ న్యూ లుక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక ఎప్పుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించే మహేష్.. తాజాగా బుల్లితెరపై మెరిశారు. అవును… ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు నిర్వహిస్తున్న ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే రియాల్టీ షోకు తన కూతురు సితారతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహేష్. ఇటీవల విడుదల ఆ షో ప్రోమో యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. ఈ సందర్భంగా అక్కడ కంటెస్టెంట్లతో కలిసి పెన్నీ పాటకు కాలు కదిపింది సీతార. తాజాగా ఈ షోకు సంబంధించి మరో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ నేపథ్యంలో ‘బాబు, కుమార్’ అనే ఇద్దరు డాన్సర్లు అద్భుతంగా డాన్స్ చేశారు. వారిద్దరు వేసిన స్టెప్పులకు మహేష్ బాబు ఫిదా అయిపోయారు. అనంతరం వారిని తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తాడు మహేష్. తాను చేసే సినిమాలో గానీ.. తను నిర్మించే సినిమాలో గానీ వారిద్దరికి అవకాశం ఇస్తానంటూ స్టేజ్ పై ఈ సందర్భంగా మాటిచ్చాడు మన సూపర్ స్టార్. దీంతో వెంటనే ఆ డాన్సర్లు ఇద్దరు మహేష్ కాళ్లపై పడిపోవడంతో వారిని హత్తుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.