ఎన్టీఆర్ 30పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. సముద్రం నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్?

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా మాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 ఇంటర్వెల్ సీక్వెన్స్ భారీ యాక్షన్ విజువల్స్ తో పూర్తి సముద్రం నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఈ పోస్టర్ లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, సముద్రంలో ఎగిసి పడుతున్న అలలు, అందులో ప్రయాణిస్తున్న పడవలతో వీడియో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ తెలుగు తెరకు కొత్త అనుభూతిని ఇస్తోంది.. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందట.. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ 8 నుంచి 9 కిలోల బరువు తగ్గాడని సమాచారం.. ఈ సినిమాలో డిఫరెంట్ మేకోవర్ తో సరికొత్తగా కనిపించనున్నాడు తారక్.. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల శివ బాగా కసరత్తులు చేస్తున్నాడు.. మొత్తంగా ఈ సినిమాను పవర్ ఫుల్ యాక్షన్ నేపథ్యంలో తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న హీరోయిన్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.