చిరంజీవి పైన ఇష్టం లేకనే.. అల్లు అర్జున్ అలా చేస్తున్నారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. వచ్చే నెలలో పుష్ప-2 సినిమాకు సంబంధించి షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు ఇక ఈ సినిమా పైన కూడా అభిమానులకు చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చిరంజీవి పుట్టినరోజు గురించి ఆయన అభిమానులు కూడా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.Chiru Is My Acharya In Many Ways - Allu Arjun - Gulte Chiru Birthdayఇక చిరంజీవి పుట్టినరోజు ఈనెల 22. అంటే రేపే అనమాట.. అయితే చిరంజీవి పుట్టినరోజుని అభిమానులు కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఫారిన్ టూరుకు వెళ్లడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చిరంజీవి బర్త్డే ను స్కిప్ చేయడానికి అల్లు అర్జున్ ఇలాంటి పనిచేస్తున్నారని కొంతమంది నేటిజెన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కార్ని వాల్ కూడా జరగనుంది. ఇక ఈ వేడుకలకు చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాకపోవడం జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ కూడా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను స్కిప్ చేస్తున్నారని కామెంట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి.Meet Allu Arjun's family of stars: From dad Allu Aravind, brother Allu  Sirish, cousin Ram Charan to uncle Chiranjeevi

దీంతో అభిమానుల సైతం అల్లు అర్జున్ మెగా హీరోని అనిపించుకోవడానికే స్కిప్ చేస్తున్నారని అభిమానులు కామెంట్లు కూడా తెలియజేస్తున్నారు. తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెగా ఫ్యాన్స్,అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య తరచూ ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ తన సినీ కెరియర్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. మరి అల్లు అర్జున్ చిరంజీవి పార్టీకి హాజరై ఇలాంటి వార్తలన్నిటికీ చెక్ పెడతాడేమో చూడాలి మరి.