మళ్ళీ పెళ్లికి సిద్ధమైన హృతిక్ రోషన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో హీరోలు మాత్రమే కాదు హీరోల భార్యలు లేదా హీరోయిన్ లే కాదు హీరోయిన్ల భర్తలు.. ఇలా వారితో విడిపోయిన తర్వాత రెండవ తోడు కోసం వెతుక్కుంటున్న విషయం ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ త్వరలోనే రెండవ వివాహానికి సిద్ధమయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ కి గతంలో అనగా 2014 లో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే తమ 14 సంవత్సరాల వైవాహిక జీవితానికి వీరిద్దరూ స్వస్థ పలికారు. ఇక ఆ తర్వాత సుసానే.. అర్స్లాన్ గోనీ తో ప్రేమలో పడింది.Exes Hrithik Roshan and Sussanne Khan to remarry? Here's the truth | Celebrities News – India TV

అంతేకాదు చాలాకాలంగా ఆమె అతనితో డేటింగ్ లో ఉంది. ఇక వీరు పీకల్లోతు వరకు ప్రేమలో మునిగి తేలుతున్నారట. అందుకే ఎప్పటికప్పుడు వీరి ప్రేమ గురించి బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుసానే – అర్స్లాన్ గోనీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇక వీరి పెళ్లి చాలా సింపుల్గా జరగబోతుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి తేదీ ఎప్పుడు? ఎక్కడ వీరు పెళ్లి చేసుకోబోతున్నారు? వివాహ వేదిక ఏది? అంటూ పలు ప్రశ్నలు మొదలవగా.. ఇంకా అన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Hrithik Roshan & Saba Azad Are Unsure But Ex-Wife Sussanne Khan Is Soon Tying The Knot With Beau Arslan Goni In A Hush-Hush Wedding?

ఇదిలా ఉండగా మరొక పక్క హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్ నటి అలాగే సింగర్ అయిన సబా ఆజాద్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఇక ఈయన కూడా ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest