ఆమెతో ఎఫైర్ కారణంగా.. దిశా పటానికి బ్రేకప్ చెప్పిన స్టార్ హీరో..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్లు లేదా సెలబ్రిటీలు కాస్త క్లోజ్ గా కనిపించారంటే చాలు వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అని.. లవ్ లో వున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి అంటే అందులో కనీసం 50% నిజం ఉందని చెప్పవచ్చు. ఇక ఇటువంటి వార్తలపై కొంతమంది నటీనటులు చూసి చూడనట్టుగా వారి పని వారు చేసుకుంటూ వెళ్తే.. మరి కొందరు మాత్రం రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపై తమదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కూడా తనపై వినిపిస్తున్న రూమర్లపై స్పందించడం జరిగింది.EXCLUSIVE: Tiger Shroff says he shares a very special relationship with  Disha Patani : Bollywood News - Bollywood Hungama

బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటాని కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక వీరిద్దరూ విడిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీలో మరిన్ని వార్తలు వైరల్ అయ్యాయి. టైగర్ ష్రాఫ్.. దిశా పటాని తో బ్రేకప్ చెప్పిన తర్వాత మరొకరికి దగ్గరయ్యాడని కూడా బాలీవుడ్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఆమె ఎవరో కాదు కేసనోవా మ్యూజిక్ వీడియోలో టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన ఆకాంక్ష శర్మ. ఇక వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు దిశ పటాని కానీ అటు టైగర్స్ ష్రాఫ్, ఆకాంక్ష శర్మ ఎవరూ కూడా స్పందించకపోవడం గమనార్హం.Is Tiger Shroff dating Akanksha Sharma? Actor has THIS to say | Bollywood  Bubble

కానీ రోజురోజుకు వినిపిస్తున్న ఊహాగానాలు నిజమే అని పలువురు నెటిజన్స్ కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే ఈ విషయాలపై టైగర్స్ ష్రాఫ్ స్పందించారు. ఆకాంక్ష శర్మతో డేటింగ్ లో లేనని స్పష్టం చేసిన ఈయన దిశాపటానితో బ్రేకప్ చెప్పిన విషయంపై స్పందించలేదు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే బడే మియా చోటే మియా , రాంబో , గణపతి పార్ట్ వన్, ఢీలా వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

Share post:

Latest