డబ్బుల కోసమే ఒప్పుకున్న అంటున్న ఇలియానా.. విషయం అదేనా?

హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎంతోమంది పేడ్ అవుట్ అయిపోయి.. తట్టాబుట్టా సర్దుకుంటే, ఇల్లు బేబీ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. ఇటీవల హారర్ జానర్ కి సంబంధించిన సినిమాలకి సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ మధ్య ఓ హారర్ హిందీ సినిమా విషయంలో ఆమెకి ఎదురైన అనుభవాల రీత్యా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం ఇలియానా చేతిలో పెద్ద సినిమాలు అనేవి లేవు. చిన్నాచితకా చిత్రాలకు అమ్మడు సైన్ చేస్తోంది. భార్గవ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఇలియానా ఈ హారర్ సినిమా చేయబోతుంది. కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో ఇలియానా లవ్‌ ట్రాక్‌ నడుపుతుందని ఓ రూమర్. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్‌ సెబాస్టియన్‌, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఐతే, ఈ వేడుకల్లో ఇలియానా కూడా కనిపించడంతో ఆ మధ్య ఈ వార్త వైరల్ అయ్యింది.

ఇకపోతే ఇల్లుబేబి మొదట్లో తెలుగులో వరుస అవకాశాలను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. YVS చౌదరి దర్శకత్వంలో దేవదాసు అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు అనతికాలంలోనే సూపర్ స్టార్ డంని సొంతం చేసుకుంది. ఇక పోకిరి అనే సినిమాతో అగ్ర హీరోయిన్ల సరసన చేరింది. కిక్ అనే సినిమాతో ఇక్కడ పాతుకుపోయింది. దాదాపు ఓ దశాబ్దకాలంపాటు ఇక్కడ వున్న తరువాత అమ్మడికి బాలీవుడ్ నుండి పిలుపురావడంతో మొత్తంగా ముంబై చెక్కేసింది.