కృతి శెట్టి ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే షాక్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కృతి శెట్టి పలు యాడ్స్ లో పనిచేసింది. ఆ తర్వాత తెలుగు తెరపై ఉప్పెన సినిమాతో ఉప్పెన లా దూసుకుపోతూ ఎంతో మంది అభిమానుల ఆరాధ్య దేవతగా ఒక వెలుగు వెలుగుతోంది కృతి శెట్టి. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో మొదటి సినిమాతోనే అవకాశాన్ని సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలలో ఏకంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకొని హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న హీరోయిన్ గా సరికొత్త రికార్డు సృష్టించింది కృతి శెట్టి.Krithi Shetty to Feature Alongside This Popular Mass-Hero in Her Next

ఇక ఇటీవల రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో కూడా నటించి అక్కడ కూడా మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే మహేష్ బాబు బావ సుదీర్ బాబు తాజాగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్లో కూడా శరవేగంగా పాల్గొంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇక అంతేకాదు కోలీవుడ్లో స్టార్ హీరో, సూర్య సరసన నటిస్తూనే మరొకపక్క విశాల్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.Sivakarthikeyan to receive Rs.30 crore for 'SK 20' | Tamil Movie News -  Times of India

ఇదిలా ఉండగా ఇంత పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫస్ట్ క్రష్ ఎవరో తెలిపి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.. ఆయన ఎవరో కాదు శివ కార్తికేయన్. ఇండస్ట్రీ లోకి వెళ్ళకముందే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ అంటే తనకు చాలా ఇష్టమని , ఇక ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతే కాదు తనే తన మొదటి ఫస్ట్ క్రష్ అని వెల్లడించింది.