బండ్ల గణేష్ పొగరుబోతు వ్యాఖ్యలు… వారికి సినిమాలు తీయడం రాదట?

బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. స్టేజ్ పైన స్పీచులు, సోషల్ మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూల్లో కౌంటర్లు బండ్ల గణేష్ ని సెలిబ్రిటీని చేశాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. అసలు విషయంలోకి వెళితే, ఈ ఆగస్టు 01 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు.

దాంతో అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో ఆగస్ట్ 1 నుండి షూటింగులు ఉండబోవు. బంద్ వల్ల ఇటు బడా సినిమాలకు అటు చిన్న చిత్రాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అలాగే టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులపైన బాగా ఎఫెక్ట్ పడే అవకాశం వుంది. తాజాగా నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలపై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ మాటలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో బండ్ల తరచూ ఏదో ఒక పోస్టులు కామెంట్లు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ని ఇండెరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మాటలు మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు అల్లు వారి అభిమానులు విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ రిలీజ్ సమయంలో తాత ముత్తాతలు గురించి మాట్లాడటంతో బండ్ల విజయ్‌కు కౌంటర్ ఇవ్వడం తెలిసినదే. రామ్ చరణ్, మహేష్ బాబు , ఎన్టీఆర్ లాంటి వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళే గొప్పనటులు అన్నట్టుగా మాట్లాడి అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ కించపరిచినట్టు అభిమానులు అర్ధం చేసుకున్నారు. అదంతా ఒకెత్తయితే తాజా నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుబడుతూ ‘సినిమాలు తీయని వారు కూడా సినిమాలను శాసించడం విడ్డురంగా వుంది!’ అని ఓ పోస్ట్ పెట్టారు. కాగా ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.