స్నేహాని వాడుకోవాలని చూసిన ఆ బడా నిర్మాత .. బిగ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన చరణ్, ఎన్టీఆర్..?

టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ ఉండేటటువంటి మెగా వారసుడు రామ్ చరణ్, నందమూరి నట వారసుడు తారక్..ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. మొదటి నుండి వీళ్లు స్నేహితులే అయినా..బయట ఎక్కడా కూడా ఆ విషయాని చెప్పకుండా..తమ పనుల్లో బిజీ అయ్యారు. RRR సినిమాతోనే నందమూరి-మెగా హీరోల ఫ్రెండ్ షిప్ విషయం బయటపడ్డింది. వీళ్లిద్దరు సొంత అన్నదమ్ముల లా కలిసి ఉండటం ఇండస్ట్రీలో హెల్తీ రిలేషన్ షిప్ పెంచేలా చేసింది.

నిజానికి RRR సినిమా తరువాత వీళ్ళ ఫ్రెండ్ షిప్ బ్రేక్ చేయాలని చాలా మంది ట్రై చేశారు. RRR సినిమాలో తారక్ పర్ ఫామెన్స్ ని కావాలనే రాజమౌళి తగ్గించారని..వాంటెడ్ గానే చరణ్ ని హైలెట్ చేశాడని..కొందరు వీళ్లిద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి చూశారు. కానీ, వాటిని ఏ మాత్రం పట్టించుకోని చరణ్-తారక్..హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తున్నారు.

కాగా, ఆ ఫ్రెండ్ షిప్ ను క్యాష్ చేసుకోవాలి అని చూసిన బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ కు మైండ్ బ్లాకింగ్ షాకిచ్చారు చరణ్, తారక్. మనకు తెలిసిందే.. కరణ్ ..కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో ని రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. ఈ షో కి బడా బాలీవుడ్ స్టార్స్, క్రేజీ సౌత్ హీరోయిన్స్ ని ఇన్వైట్ చేసి..వాళ్ళ పాపులారిటీని మంచిగా వాడుకుంటున్నారు. అయితే, ఈ షో కి ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్లుగా చరణ్, ఎన్టీఆర్ ని ఆహ్వానించారట కరణ్.RRR తో బాలీవుడ్ లెక్కలను మార్చేసిన ఈ హీరోస్ తో షో స్టార్ట్ చేస్తే..ఓపెనింగ్స్ బ్లాక్ బస్టర్ గా ఉంటాయని ప్లాన్ చేశారట. కానీ, ఇద్దరు తమకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.