స్టార్ హీరోలను మించిపోయే ప్రాపర్టీలు..నరేష్ ఆస్తి అన్ని వందల కోట్లా..?

ఈ మధ్య కాలంలో సీనియర్ యాక్టర్ నరేష్ పేరు మీడియాలో బాగా వైరల్ గా మారింది. మొదట ఏమో పెళ్లిల్లు..ఆ తరువాత కుటుంబ గొడవలు..ఆ తరువాత పొలిటికల్ రచ్చ..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో లివింగ్ రిలేషన్ షిప్..అబ్బో మామూలుగా లేదు లేండి నరేష్ యవ్వారం. మనకు తెలిసిందే..నరేష్ కు ఆల్ రెడీ పెళ్లైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాడు.

ఇప్పుడు మూడో భార్య రమ్య రఘుపతికి కూడా విడాకులు ఇచ్చి..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల పై నరేష్ రియాక్ట్ అవుతూ.. నాలుగో పెళ్లి కాదని..జస్ట్ లివింగ్ రిలేషన్ లో ఉన్నామని..పెళ్లి పై కాంట్ర వర్షీయల్ కామెంట్స్ చేశాడు. ఈ గొడవ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది. కాగా, ఇలాంటి క్రమంలోనే..నరేష్ కళ్లు చెదిరే ఆస్తుల లెక్కలు బయటపడ్డాయి.

మనకు తెలిసిందే నరేష్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో నే అయినా..ఇప్పుడు హీరో తండ్రి పాత్రలు వేస్తూ..చేతికి వచ్చిన రోల్స్ చేస్తున్నారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ప్రజెంట్ నరేష్ ఒక్కో సినిమా కి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తక్కువే. కానీ ఆయన తల్లి విజయ నిర్మల బ్రతికి ఉన్నప్పుడు..ఆయనకు కొన్ని ఆస్తులు చేరవేసిన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఒక్కేఒక్క కొడుకు కావడం తో నరేష్ కే తన ఆస్తి మొత్తం ఇచ్చేసిన్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. ప్రజెంట్ అవన్ని కలుపుకుని.. నరేష్ ఆస్తుల చిట్టా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మొత్తంగా నరేష్ కి 500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నరేష్ కి ఏకంగా నాలుగు ఫామ్ హౌస్ లు ఉన్నాయట. అంతేకాదు గచ్చిబౌలిలో సుమార్ 7 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉందట . అన్నింటికన్న ఇదే అత్యంత ఖరీదైనదిగా తాజా లెక్కలు చెబుతున్నాయి. అలాగే మొయినాబాద్, శంకర్ పల్లిలో కూడా నరేష్ కి ఆస్తులు లు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిల్లో నరేష్ తన తల్లి దగ్గర నుండే సుమ్మరు 400 కోట్ల ఆస్తులు వచ్చిన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.