నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!

అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.

అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ పై ఇలాంటి వార్తలు గతంలో కూడా వచ్చాయి. కన్నడ స్టార్ హీరో… ఈగ సినిమాలో విలన్ గా నటించిన కిచ్చా సుదీప్ తో నిత్యామీనన్ రిలేషన్షిప్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ మ్యాటర్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే నిత్యామీనన్ సుదీప్ తో ప్రేమలో ఉన్నారు అని వార్తలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నిత్యామీనన్ సుదీప్ తో కలిసి కోటికొక్కడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిత్యామీనన్ సుదీప్ తో ఎక్కువగా క్లోజ్ గా ఉండేదట. అంతేకాకుండా షూటింగ్ తర్వాత కూడా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండే వారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా అదే సమయంలో సుదీప్ తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. దాంతో సుదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం కూడా నిత్యామీనన్ అంటూ కన్నడ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చింది. తను ఇష్క్ సినిమాలో నటించినప్పుడు నితిన్ తో ప్రేమలో ఉన్నానని, అలా మొదలైంది సినిమా సమయంలో నానితో ప్రేమలో ఉన్నానని కూడా ఇలాంటి వార్తలే వచ్చాయని చెప్పింది.

అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ తో కూడా ఒక సినిమా చేసినప్పుడు అతనితో ప్రేమలో ఉన్నానని వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్ అనుకోవచ్చు… కాకపోతే పెళ్లయిన హీరోలతో కూడా అలాంటి రిలేషన్షిప్ అంటగట్టడం బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది.