‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్‌: కుమ్మేసిన రవితేజ.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయండిరా..!!

యస్.. గత కొంత కాలంగా మాస్ మహారాజ రవితేజ కి ఒక్క హిట్ కూడా పడలేదు అన్నది మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో క్రాక్ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఆ తారువాత రిలీజ్ అయిన ఖిలాడి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ అయ్యింది దీంతో..రవి తేజ గ్రాఫ్ మళ్ళీ డౌన్ అయ్యింది. సినీ ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి..తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్ని.. మాస్‌ మహారాజా స్థాయికి ఎదిగాడు రవితేజ. అలాంటి ఈయన కి ఇప్పుడు హిట్లు లేక అల్లాడిపోతున్నారు. పాపం, ఈయన ఫ్యాన్స్ కూడా అన్న ఒక్క హిట్ కొడితే చూడాలని అనుకుంటున్నారు..

అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఓ లడ్డు లాంటిది అనే చెప్పాలి. ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రవితేజ ..రీసెంట్ గా హీరోగా అంటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాని కొత్త దర్శకుడుగా పరిచయమవుతున్నాడు శరత్‌ మండవ . ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యంశ కౌశిక్, రజిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా టైటిల్ తోనే ఓ రేంజ్ మాస్ ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేసిన డైరెక్టర్..రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ టరిలర్ చూసిన రవితేజ అభిమానులు పూనాకాలు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు.

చాలా రోజుల తరువాత మళ్ళీ రవితేజ కి పక్క మాస్ హిట్ పడబోతుందని అంటున్నారు. ముఖ్యం సినిమా రవితేజ లుక్స్ భీబత్సంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అన్యాయానికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేదే అస్సలు కాన్ సెప్ట్. ఈ సినిమాలో రవితేజ కొందరు కనిపించకుండా పోయిన వారి కోసం వెతికే పాత్ర అని తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో రవితేజని చూస్తుంటే, ఇడియట్ సినిమా రోజులు గుర్తు వస్తున్నాయి అంటున్నారు అభిమానులు.

ఎప్పటిలాగానే తన మాస్ యాంగిల్ ని చూపించి..అభిమానులకు ఫుల్ మీల్స్ రెడీ చేశాడు ఈ మాస్ హీరో. అన్నింటికన్న..రవితేజ చివర్లో చెప్పే డైలాగ్..” ఇప్పుడే వేట మొదలైంది”.. అంటూ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు రవితేజ. ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. శ్ళ్వ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ తో పాటు రవితేజ కూడా కలిపి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 29న విడుదల కాబోతుంది.

Share post:

Latest