రష్మిక పై గుర్రుగా ఉన్న సమంత..హాట్ హీరోయిన్స్ కోల్డ్ వార్ కి కారణం ఆ హీరోనేనా ..?

యస్..తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే..ఇదే నిజం అనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేర్లు సంపాదించుకున్న..రష్మిక-సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటి రష్మిక ఫుల్ ఫాంలో ఉంది. అక్కడి ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి..మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు కొట్టేసింది. ప్రజెంట్ రష్మిక చేతిలో నాలుగు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

మరో రెండు సినిమాలు హోల్డ్ లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. నిజానికి సౌత్ బ్యూటీస్ లో ఎవ్వరు ఇలా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఆఫర్స్ అందుకోలేదు. రష్మిక చేసిన ఒక్క సినిమా డైరెక్ట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అవ్వలేదు. అయినప్పటికీ అక్కడ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక. మిషన్ మజ్ను,గుడ్ బై, యానిమల్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే, ఎప్పటి నుండి బాలీవుడ్ పై కన్నేసిన సమంత మాత్రం..ఇంత వరకు ఒక్క సినిమా అఫిషీయల్ గా ప్రకటించలేదు. ఇదిగో ఆఫర్..అదిగో సినిమా అంటున్నారే తప్పిస్తే..ఇంత వరకు అఫిషీయల్ అనౌన్స్ మెంట్ లేదు .

దీంతో బీ టౌన్ లో సమంత వర్క్ ఎక్స్పీరియన్స్ పై నెగిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత కి సెకండ్ హీరోయిన్ ఛాన్సులే ఎక్కువ అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. సమంత తన విడాకుల మ్యాటర్ తో ఫోటో షూట్ లతో హాట్ గా కంటెంట్ ఇస్తున్నా..ఆఫర్స్ అందుకునే స్దాయి లేదు అంటూ చిన్న చూపు చూస్తున్నారట. దీంతో సమంత రష్మిక పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న యానిమల్ సినిమాలోను ఫస్ట్ సమంతను హీరోయిన్ గా అనుకున్నారట.

కానీ ఆమె పై జరుగుతున్న నెగిటీవ్ ట్రోలింగ్ చూసి..రష్మిక ను ఫిక్స్ చేశారట. రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది సమంత ఇలాగే రెండు బిగ్ ఆఫర్స్ సమంత అకౌంట్ నుండి రష్మిక ఖాతాలోకి వెళ్లిపోవడం..అదే టైంలో సమంత పై నెగిటీవ్ ట్రోలింగ్..రష్మిక ను బాలీవుడ్ జనాలు దేవతలా చూడటం సమంత జీర్ణించుకోలేకపోతుంది..అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.