NTR 30 సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం.. ఆమెనా..?

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి 2021 డిసెంబర్ నుంచే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2022 మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడం గమనార్హం.

ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి కారణం హీరోయిన్ అని తెలుస్తోంది. కాస్టింగ్ ఎంపికలు కూడా ఆలస్యం అవ్వడమే అని ఇండస్ట్రీలో వార్తలు కోడైపోతుంది. ఇక ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఉండే అగ్ర హీరోయిన్ల అందరిని కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సంప్రదించారు. ఇంతకుముందు కియరా పేరు వినిపించినా ఆమె రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఆర్సి 15 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు..

ఇక మరొకవైపు అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఆలియా భట్ పేరు కూడా వినిపించింది. ఇక ఆ తర్వాత శ్రీ లీల, కృతి శెట్టి వంటి యంగ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ వీళ్ళలో ఎవరిని కూడా కొరటాల శివ తన సినిమా కోసం ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాలో నటించే హీరోయిన్ పాన్ ఇండియా హీరోయిన్ అయి ఉండాలి అని ఆయన భావిస్తున్నారట. ఇక ఆలియా లాగా మంచి ఇమేజ్ ఉన్న కథానాయక కావాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత తో దర్శక నిర్మాతలు టచ్లో ఉన్నారు అని.. ఆమెను ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని ..కానీ ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక బృందావనం, జనతా గ్యారేజ్ లాంటి పాపులర్ విజయాలను సొంతం చేసుకున్న వీరు.. రభస, రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలతో డిజాస్టర్ ని కూడా మూటగట్టుకున్నారు. మరి ఐదవ సారి ఈ కాంబినేషన్ నిజమైతే ఎలాంటి సక్సెస్ ను పొందుతుందో తెలియాల్సి ఉంది.