త్రివిక్ర‌మ్ – మ‌హేష్ సినిమాకు కొత్త క‌ష్టం….!

సూప‌ర్‌స్టార్ మహేష్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జ‌రుగుతోంది. అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ చేస్తోన్న సినిమా ఇదే కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో అత‌డు, ఆ త‌ర్వాత ఖ‌లేజా వ‌చ్చాయి. ఖ‌లేజా వ‌చ్చి కూడా 12 ఏళ్లు అవుతోంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తుండడంతో పాటు ఇద్ద‌రూ హిట్ల‌తో ఫామ్‌లో ఉండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభించేయాలన్నది ఆలోచన. సరే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. సినిమా ఎంత‌లా స్పీడ్‌గా పూర్తి చేసినా ఎప్పుడు రిలీజ్ చేయాల‌న్న‌ది మాత్రం తేల‌ని ప‌రిస్థితి. స‌రైన రిలీజ్ డేట్ లేదు. పుష్ప 2 సినిమాను దసరా, డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. ఇక 2023 సంక్రాంతికి చాలా సినిమాలు రుమాలు వేసి వున్నాయి.

ఇక 2023 స‌మ్మ‌ర్‌కు శంకర్-రామ్ చరణ్ సినిమా విడుదల చేస్తారు. సంక్రాంతికి, స‌మ్మ‌ర్‌కు మ‌ధ్య‌లో చాలా పెద్ద సినిమాలు ఖ‌ర్చీఫ్‌లు వేస్తున్నాయి. ప్ర‌భాస్ సినిమాలు అయితే ఈ ద‌స‌రా నుంచి మొద‌లై ఆ త‌ర్వాత సంక్రాంతికి.. వ‌చ్చే స‌మ్మ‌ర్ వ‌ర‌కు లైన‌ప్‌లో ఉన్నాయి. వచ్చే సమ్మర్ వేళకు బాలయ్య, చిరంజీవి ల సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇలా అంతా టైట్ పొజిష‌న్‌గా ఉంది.

ఈ టైంలో అస‌లు మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ? తెలియ‌ట్లేదు. ఇప్పుడు సినిమా ఫినిష్ చేయడం కన్నా సరియైన విడుదల డేట్, సరైన సీజన్ కీలకం అయిపోయింది టాలీవుడ్ కు. అదే క‌ష్టం మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమాను వెంటాడుతోంది.