నాన్ RRR రికార్డుల‌తో సర్కారు వారి పాట ఫ‌స్ట్ డే ఊచ‌కోత వ‌సూళ్లు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మ‌హేష్‌బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా సాలిడ్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయ్యింది. వసూళ్ల పరంగా ఈ సినిమా భారీ నంబర్స్ తో నాన్ త్రిబుల్ ఆర్ రికార్డుల‌తో ఊచ‌కోత కోస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి.

నైజాంలో స‌ర్కారు వారి పాట నాన్ RRR ఓపెనింగ్స్ సెట్ చేసి రికార్డు లెవెల్లో 12.24 కోట్ల షేర్ ని రాబట్టింది.
ఓవ‌రాల్‌గా ఏపీ , తెలంగాణ వ‌ర‌కు ఫ‌స్ట్ డే చూస్తే రు. 50 కోట్ల గ్రాస్‌.. రు. 36 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ – 14 రీల్స్ – జీఎంబీ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించాయి.

ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ డే వసూళ్లు ఇలా ఉన్నాయి…
నైజాం – 12. 24 కోట్లు
సీడెడ్ – 4.70
ఉత్త‌రాంధ్ర – 3.74
ఈస్ట్ – 3.25
వెస్ట్ – 2.74
గుంటూరు – 5.83
కృష్ణా – 1.85
నెల్లూరు – 1.56
———————————
ఫ‌స్ట్ డే గ్రాస్ – 50. 10 కోట్లు
ఫ‌స్ట్ డే షేర్ – 36.01 కోట్లు
———————————