RRRలో రాజమౌళి బ్లండర్ మిస్టేక్.. కేసు పెట్టాల్సిందే..ఊరుకునేలా లేరు రా బాబోయ్!!

వాట్..రాజమౌళి పై కేసు పెట్టాలా..? ఎందుకు..? అసలు ఏమైంది..? అని అనుకుంటున్నారా..యస్..ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ చూసి కొందరు జనాలు నవ్వుకోగా ..మరికొందరు..అమ్మ బాబోయ్ ఇంత పెద్ద తప్పు చేశాడా రాజమౌళి..అయితే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అంటూ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. మనకు తెలిసిందే..దర్శక ధీరుడు రాజమౌళి రణం రౌద్రం రుధీరం అనే సినిమా రీసెంట్ తెరకెక్కించి..సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కి రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాని అందుకుంది. ఈ సినిమాలో హీరొలుగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. సినిమా లో ఎక్కడో తారక్ ని కావాలనే తక్కువ చేసి చూపించారు అన్న కామెంట్స్ వినిపించినా .. తారక్ ఆయన కు ఇచ్చిన పాత్రకు 100శాతం న్యాయం చేశారంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేశారు. కాగా, ఈ సినిమాలో తారక్ ఓ బైక్ వాడుతాడు గుర్తుందా … చూడటానికి ఓల్డ్ మోడల్ అయినా.. చాలా అట్రాక్టీవ్ గా ఉంటుంది.

సినిమాలో ఆ బైక్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే, ఈ బైక్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి.. ఆ బైక్ తో సీన్స్ షూట్ చేసేటప్పుడు మాత్రం ఓ పొరపాటు చేసాడు. ఈ బైక్ డిఫరెంట్ సీన్స్ డిఫరెంట్ నంబర్స్ ప్లేట్ కలిగి ఉండడాన్ని ఓ నెటిజెన్ గమనించారు. సరే చూసి పోనీలే అని ఊరుకున్నాడా..నో వే.. ఒకే బైక్ రెండు నంబర్స్ ఎలా కలిగి ఉంటుంది. ఈ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ రాజమౌళిని ప్రశ్నించారు. పనిలో పని హైదరబాద్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ట్యాగ్ చేసి, రాజమౌళిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఇష్యూ వైరల్ గా మారింది.