అప్పుల్లో ఉన్న రాధిక శరత్ కుమార్ కు.. ఊహించని సహాయం చేసిన చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి.. ఈయన స్వయంకృషితో ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన హీరోగా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితులు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయనను ఇండస్ట్రీ పెద్ద అని అంటూ ఉంటారు ఎంతో మంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలకు సేవచేయడానికి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లాంటివి స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి కరోనా వైరస్ కాలంలో కష్టాల్లో ఉన్న కార్మికులకు ఆదుకోవడానికి ఎన్నో చేశారు.
అయితే ఇలా సినీ కార్మికుల కష్టాల గురించి ఆలోచించిన చిరంజీవి తన స్నేహితురాలికి కష్టం వస్తే ఊరుకుంటారా.. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఒకప్పుడు తనతో పాటు ఎన్నో సినిమాల్లో కలిసి నటించి ఒక మంచి స్నేహితురాలిగా మారిపోయిన సినీ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంది అని తెలుసుకున్న చిరంజీవి ఆమెను సమస్యల నుంచి గట్టెక్కించేందుకు సరి కొత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాను నిర్మించి అవకాశాన్ని రాధిక శరత్ కుమార్ కు ఇచ్చారు చిరంజీవి. ప్రస్తుతం 60 ఏళ్లు దాటి పోతున్నా సూపర్ స్పీడ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి నిర్మాణ బాధ్యతలను చిరంజీవి రాధిక శరత్కుమార్ అప్పగించారు. ఈ విషయాన్ని రాధిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు అంటూ అధికారికంగా వెల్లడించింది రాధిక. ఇక తన బ్యానర్ రాడాన్ ను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తోంది రాధిక. ఇలా కష్టాల్లో తన స్నేహితురాలు ఉంది అని తెలుసుకున్న చిరంజీవి సినిమా నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తూ ఫైనాన్షియల్ సమస్యలు తీర్చేందుకు సిద్ధమవడం గురించి తెలిసి అభిమానులు అందరూ కూడా చిరంజీవికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు అని చెప్పాలి..