రష్మిక కి పెళ్ళి అవ్వదా..అంత పెద్ద ప్రాబ్లమ్ ఉందా..?

రష్మిక మందన్నా .. ఈ పేరు గురించి కొత్త ఇంట్రడక్షన్లు అవసరం లేదు. రావడం రావడమే..అందరికి కళ్ళు తన వైపు అప్డేలా చేసుకుంది. అంతేనా వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. రష్మిక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని..మిగతా హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. అంతేనా నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది.

బన్నీ నటించిన పాన్ ఇండియా సినిమా “పుష్ప” లో రష్మిక నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. గ్లామర్స్ గానే కాదు ..డీగ్లామరస్ లుక్ లోనే అదరకొట్టేసింది. ముఖ్యంగా “నా సామీ” అంటూ అమ్మడు నడుము తిప్పుతుంటే కూర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిపోయాయి . అంత హీట్ పుట్టించింది ఈ భామ. మరి ఇలాంటి భామ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా..ఎవరిని చేసుకుంటుందా అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా..షాకింగ్ మ్యాటర్ లీకై నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

ప్రముఖ జోతిష్య పండితులు వేణు స్వామీ..గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సమంత పెళ్లి పెటాకులు అవుతుందని బల్ల గుద్ది చెప్పిన ఆయన మాటలు అప్పుడు ఎవ్వరు నమ్మలేదు. కానీ, ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైంది. అలాగే, ప్రభాస్ కి కూడా టైం బాగోలేదు అని చెప్పారు..రాధే శ్యామ్ ఫ్లాప్ తో ప్రభాస్ పై నెగిటివిటీ ఏర్పడింది. ఇక ఇప్పుడు రష్మిక, నయనతారల గురించి అలాంటి కామెంట్స్ నే చేసిన్నట్లు తెలుస్తుంది. నయనతార జీవితంలో పెళ్ళి బంధం నిలుపుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చిన ఈయన ఆయన.. రష్మిక జాతకంలో దోషం ఉందని..ఆమె పెళ్లి టైంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురుకోవాలని చెప్పారట. అంతేకాదు సమంత లాగే రష్మిక కూడా డివర్స్ తీసుకునే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయట. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. నిజంగా రష్మిక జాతకంలో అంత పెద్ద దోషం ఉందా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.