అయ్య బాబోయ్..ప్రేమ పై కృతి ఓపీనియన్ ఇదా..?

“ప్రేమ”..రెండు అక్షరాల పదమే. కానీ, అది మిగిల్చే బాధ..నింపే ఆనందం రెండు..అనుభవించడానికి జీవితకాలం సరిపోదు. అలాంటి గొప్ప ప్రేమ అందరికి దక్కదు. అదేదో సినిమా పవన్ కల్యాణ్ కి భూమిక చెప్పిన్నట్లు..” ప్రేమ ఎంతో విలువైనది. అందరికి దొరకలేనిది” అంటూ పెద్ద పాఠాలే చెప్పింది. అయితే..ఇలాంటి ప్రేమను పొందాలి అని అందరు అనుకుంటారు. అదే విషయం యంగ్ బ్యూటీ ని అడిగితే..వాట్.. ప్రేమ..నాకు అంత టైం లేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆ హీరోయిన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఒక్క సినిమా ఒక్కేఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో “ఉప్పెన” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి..ఫస్ట్ సినిమాతోనే అందరి చూపు తన వైపు పడేలా చేసుకుంది. ఆ తరువాత..నాని తో శ్యామ్ సింగరాయ్ ..నాగ చైతన్య తో బంగార్రాజు అంటూ వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకుంది. ప్రజెంట్ కృతిశెట్టి తెలుగులో సుధీర్ బాబు సరసన చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య సినిమాలో నటిస్తుంది.

ఫుల్ బిజీ గా ఉన్న అమ్మడుని ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా..ఆమె అది ఫీల్ అయితేకానీ చెప్పలేం ..ప్రజెంట్ నేను ఫుల్ బిజీ..ప్రేమ గురించి ఆలోచించే టైం..ప్రేమించే టైం రెండు నాకు లేవు ” అంటూ చెప్పుకొచ్చిందట. దీంతో నెటిజన్స్ కి మరోసారి చిక్కింది అమ్మడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి కృతి ..తీరా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే కృతి చిన్న పిల్ల అప్పుడే ఆమెకు ప్రేమ దోమ లాంటివి ఎలా తెలుస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.