విశ్వక్ సేన్ ను ఆ హీరో ఫ్యామిలీ కావాలనే తొక్కేస్తున్నారా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ పేరు ఎలా మారు మ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్నాళ్లు యంగ్ హీరో గా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పాపులర్ అయితే.. ఇప్పుడు నిజాయితీ పరుడుగా వార్తల్లో కి ఎక్కారు. సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ బొల్తా కొట్టి..రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. దీని పై ఓ ప్రముఖ ఛానెల్ డిబెట్ నిర్వహించడం ..అక్కడకి విశ్వక్ సేన్ వెళ్లి..లైవ్ లో కూర్చుని మాట్లాడుతుండగా..యాంకర్-హీరో మధ్య మాట మాట పెరిగి..హీరో బూతు పదం వాడటం..ఆమె GET OUT అంటూ అరవడం సంచలనంగా మారింది.

అయితే, దీని పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నే నడుస్తుంది. ఇప్పుడిప్పుడే హీరో గా ఎదుగుతున్న విశ్వని తొక్కేయాలని కావాలనే ఓ బడా ఫ్యామిలీ ఇలా చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీ మొత్తం నాలుగు ఫ్యామిలీలే ఏలేస్తున్నాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అని లేకుండా..ఇండస్ట్రీని వాళ్ళే నాలుగు భాగాలుగా పంచేసుకున్నారని.. విశ్వక్ సేన్ గతంలో తాను నటించిన సినిమా ప్రమోషన్స్ కి పిలిచిన సదరు బడా హీరో రాలేదు అని..కనీసం అతన్ని ఇంటి లోపలకి కూడా రానివ్వలేదు అని..దీంతో ఆ హీరో నే ఇలా కుమ్మకై కావాలనే సినిమా కి నెగిటివ్ టాక్ రావాలని ఇలా చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ కి నందమూరి అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. నిన్ను ఎవ్వరు ఆపలేడు నువ్వు చేసిందే కరెక్ట్..నీకు మేమున్నాం ..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు విశ్వక్ సేన్ చేసిన ప్రమోషన్స్ ప్రాంక్ వీడియో పై కూడా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రోజుకో కొన్ని వందల ప్రాంక్ వీడియోలు వస్తున్నాయి. వాటి పై రెస్పాండ్ అవ్వకుండా.. కేవలం విశ్వక్ సేన్ మీదనే ఇలా పగపట్టి..ఆయన కెరీర్ పై కొట్టడం న్యాయం కాదు.. ఇప్పుడిప్పుడు హీరో గా ఎదుగుతున్న విశ్వక్ ను ఎంకరేజ్ చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు.