పూజా VS సమంత..ఎవరు బెస్ట్ హీరోయిన్..?

ప్రస్తుతం ఇదే ప్రశ్న నెట్టింట తెగ వైరల్ గా మారింది. జనరల్ గా సోషల్ మీడియాలో పోల్స్ నిర్వహిస్తుండటం చాలా కామన్. చాలా మంది నెటిజన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్స్ ఇస్తుంటారు. పొలిటీషియన్స్ గురించి, యాంకర్స్ గురించి, హీరోల గురించి, వాళ్లు నటించిన సినిమాల గురించి ఇలా రోజుకో పోల్ మనకు కనిపిస్తూనే ఉంటుంది . ప్రస్తుతం పూజా VS సమంత అనే ప్రశ్న టూ హాట్ ట్రెండింగ్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోయిన్లే.. ప్రజెంట్ ఇద్దరు సినిమాల పరంగా ఫుల్ బిజీ గా ఉన్నారు.. ఇద్దరు టాప్ 5 హీరోయిన్ ల లిస్ట్ లో ఉన్నారు. ఇంచు మించు ఇద్దరు ఒక్కే విధంగా సినిమాల్లో పారితోషకం పుచ్చుకుంటున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ పోల్స్ కనిపిస్తున్నాయి.

ఇక ఈ ప్రశ్నకి చాలా మంది సమంత నే బెస్ట్ అంటూ ఓత్లు వేస్తున్నారు. దానికి కారణం లేకపోనూ లేదు. సినిమాల పరంగా చూసుకుంటే సమంత చూస్ చేసుకునే మూవీస్ ఢిఫరెంట్ గా ఉంటాయి. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు సమంత లైక్ చేస్తుంది. గ్లామరస్ పరంగా కూడా ఇష్టపడుతుంది, కానీ సినిమా సినిమాకి తనలోని షేడ్స్ మారుస్తూ..అభిమానులకు కొత్త సమంత ని చూయిస్తూ వస్తుంది. ఏమాయ చెశావే సినిమా మొదలుకుని..మొన్న వచ్చిన KRK వరకు సమంత ఢిఫరెంట్ రోల్స్ లో నటించింది. ముఖ్యంగా..మనం, ఓ బేబీ, రాజు గారి గది 3, మజిలీ, బృందావనం, జనత గ్యారేజ్, ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరిస్..ఈ సిరీస్ సమంత కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది.

ఇక అదే మనం పూజా హెగ్డే..గురించి మాట్లాడుకుంటే. ఆమె ఫస్ట్ హిట్ కొట్టాడానికే దాదాపు నాలుగు ఐదేళ్లు తీసుకుంది. చేసిన ఫస్ట్ సినిమా నుండి అన్నీ గ్లామరస్ పాత్రలే కానీ, నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయలేదు. ఎక్స్ పోజింగ్ పరంగా మెప్పించిందే కానీ.. ఇంత వరకు పూజా నటన పరంగా ది బెస్ట్ రోల్స్ చూస్ చేసుకోలేదు. దీంతో అందరు సమంతనే బెస్ట్ హీరోయిన్ గా చూస్ చేసుకుంటున్నారు. కానీ, ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కేలా ఉంది. ప్రజల అభిమానం ఒక్కేలా దక్కుతుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..?