మంచి సీన్ మిస్ చేసారే..అల వైకుంఠపురములో అన్ సీన్ వీడియో..!!

యస్..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. ఇంత మంచి సీన్ ని ఎందుకు కట్ చెశారు రా సామీ అని. అల్లు అర్జున్-పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లు గా మాటల మాంత్రికుడు డైరెక్షన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూజా అందాలు, బన్నీ నాట్యాలు ఈ సినిమా కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కి మ్యూజిక్ బాగా హైలెట్ గా నిలిచింది.

తమన్ అందించిన పాటలు ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ లు క్రియేట్ చేశారు. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా..అంటూ ఓసారి..రాములో రాములా అంటూ మరోసారి..బుట్టబొమ్మ సాంగ్ అయితే ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ప్రతి పెళ్లిలో, ఫంక్షన్ లో ఈ పాట ఉండాల్సిందే..నడుము తిప్పాల్సిందే.. అంతాలా ఈ పాట పాపులర్ అయ్యింది. సినిమాలోని డైలాగ్స్ కూడా బాగా అలరించాయి. ఇక ఈ సినిమా రీసెంట్ గా నె హీందీలోకి డబ్ అయ్యింది. అక్కడ కూడా మంచి విజయం అందుకుంది ఈ సినిమా.

అయితే , తెలుగు వర్షెన్ లో లేని ఓ సీన్ హీందీలో హిందీ డబ్బింగ్ వర్షన్‌లో కనిపించింది. దీన్ని తాజాగా నటుడు సుశాంత్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. పూజా-బన్నీ ల మధ్య కామెడీ పండించే సీన్ చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. అంతేకాదు ..ఇంత మంచి సీన్ ఎలా మిస్ చేశావు గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నివితా కోపం..సుశాంత్ అమాయకత్వం..బన్నీ పర్ ఫామెన్స్..పూజా తప్పించుకోవడం ..అబ్బా భళ్ళే ఉందిలేండి .. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటారు. మరి అలాంటి సీన్ ను మీరు ఓ లుక్కేయ్యండి.