చీరకట్టులో సన్నీ పాప.. ఎగిరెగిరి వేస్తోందిగా!

శృంగార తార సన్నీ లియోన్ ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కాస్త తగ్గించింది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుండటంతో అమ్మడి సినిమాల సంఖ్య చాలా తక్కువయ్యయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందాల డోస్‌ను ఏమాత్రం తగ్గించడం లేదు ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచు విష్ణు నటిస్తున్న ఓ సినిమాలో సన్నీ పాప నటిస్తుండటంతో ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే తాజాగా చీరకట్టులో ఎగిరెగిరి బంతాట ఆడుతున్న సన్నీ లియోన్ వీడియో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. తన భర్తతో కలిసి బాస్కెట్ బాల్‌ను సరదాగా ఆడుతున్న సన్నీ, చీరకట్టులో కనిపించింది. నడుము అందాలు చూపిస్తూనే అమ్మడు భర్తతో కలిసి ఎగిరెగిరి బంతిని పైకి విసురుతుంటే కుర్రాళ్ల గుండెలు ఆగమైపోతున్నాయి.

చీరకట్టులో కూడా సన్నీ పాప అందాల విందు ఏమాత్రం తగ్గకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక సన్నీ పాపను వెండితెరపై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని వారందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఏదేమైనా సన్నీ పాప తాజా వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Share post:

Latest