కొరటాలకి కఠినమైన కండీషన్ పెట్టిన తారక్..భళే ఇరుక్కున్నాడే..?

మనకు తెలిసిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా కమిట్ అయ్యాడని..మరి కొన్ని రోజుల్లో ఆ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడని. రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR కోసం నాలుగేళ్లు ఆ సినిమాకే స్టిక్ అయిన తారక్..మధ్యలో బోలెడు సినిమాలని వదిలేశాడు. కరోనా కారణంగా కూడా చాలా టైం వేస్ట్ అయ్యింది. దీంతో తారక్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారట.

ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ చేయబోతున్న డైరెక్టర్ కొరటాలకు కేవలం 70 రోజుల కాల్ షీట్లనే కేటాయించాడట. కొరటాల ఏం చేసినా ఈ 70 రోజుల్లోనే తారక్ పై చిత్రీకరించాల్సిన అన్నీ సీన్లు ..పాటలు చేయాల్సిందే. ఆ తరువాత వెంట నే బుచ్చి బాబు సినిమాను పట్టాలెక్కించనున్నాడు తారక్. నిజానికి తారక్ పెట్టిన కండీషన్ కొంచెం కఠినమైనదే కానీ..అదే కరెక్ట్. ఎందుకంటే.. అలా మనం టైం ను ఫిక్స్ చేసుకోకపోతే ..ఆరు నెలలో తీయాల్సిన ..రెండు మూడు ఏళ్ళు పడుతుంది. అసలే RRR 2 కూడా ఉండబోతుంది అంటున్నారు.

అదే జరిగితే మరో మూడు ఏళ్లు తారక్ రాజమౌళి కే అంకితం కానున్నాడు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిన అలియా కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వబోతుంది. ఈ క్రమంలో ఆమెకు వేరే ప్లాన్ ఉంటాయికాదా..సో, కొరటాల కొంచెం కష్టమైన సినిమాని ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్ గా పూర్తి చేస్తే ఆయనకే మేలు. లేకపోతే..కొరటాలకి కష్టాలు తప్పవు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి కొరటాల ఏం చేస్తారో చూడాల్సిందే..!!