‘ఊ అంటావా’ కొరియోగ్రాఫర్‌ ఇంత దుర్మార్గుడా.. వెలుగు చూసిన షాకింగ్ నిజాలు..!

‘ఊ అంటావా మావా..ఊ ఊ అంటావా మావా”..అబ్బో ఈ పాట సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. మనలో చాలా మంది కూడా ఈ పాటను తెగ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పని అయిపోయాక రిలాక్స్ కోసం మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం ఫోన్ లో హెడ్ సెట్ పెట్టుకుని..కళ్ళు మూసుకుని..ఈ పాట వింటుంటే ..బ్యాక్ గ్రౌండ్ బీట్..దేవీ మ్యూజిక్..చంద్రబోస్ లిరిక్స్..సమంత హాట్ స్టెప్పులు గుర్తువస్తూ ఉంటాయి. ఇక ఆ ఊపులో మనం కూడా కాళ్లు కదుపు తు చేతులు ఊపుతూ నాలుగు స్టెప్పులేస్తాం అంతా బాగా అట్రాక్ట్ చేసింది జనాలను ఈ పాట.

ఈ పాట కు మెయిన్ ప్లస్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ గొంతు అయితే.. రెండొది స్టెప్పులు పడినా ఐదు ఆరు స్టెప్పులు కూడా మంచి బీట్ లో కంపోజ్ చేశాడు కొరియోగ్రాఫర్. సమంత అల్లు అర్జున్ తో కొరియోగ్రాఫర్ వేయించిన స్టెప్పులు సినీ లవర్స్ ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ పాటని కొరియోగ్రాఫి చేసింది.. చెన్నైకి చెందిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. ఈయన దాదాపు అన్ని చిత్ర పరిశ్రమలలో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్. గణేష్ తరచుగా తెలుగులో అల్లు అర్జున్ కోసం పాటలకు కొరియోగ్రాఫ్ చేస్తాడు.

అయితే ఈ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు కేసు రిజిస్టర్ అయ్యిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబై పోలీసులు అదుపులో ఈయన ఉన్నట్లు తెలుస్తుంది. అతని కో డ్యాన్సర్ ఈ కేసు నమోదు చేసిన్నట్లు లాయర్స్ తెలుపుతున్నారు. అతనిపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఆయన దగ్గర పని చేసే కో డ్యాన్సర్ తో గణేష్ ఆచార్య..అసభ్యకరంగా ప్రవర్తించాడని ..సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తనను బలవంతం చేశాడని.. అతని దగ్గర పని చేసిన అన్ని రోజులు వల్గర్ మాటలతో చేష్టలతో టార్చర్ చూయించాడని ..ఆ కంప్లైట్ లో పేర్కోన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గణేష్ ఆచార్య తనను వేధించాడని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని మరియు తన అశ్లీల కంటెంట్‌ను కూడా చూపించాడని ఆమె ఆరోపించింది. దీంతో గణేష్ ఆచార్య పై సెక్షన్లు 354-ఎ (లైంగిక వేధింపులు), 354-సి (వాయిరిజం), 354-డి (స్టాకింగ్), 509 (ఏదైనా మహిళ యొక్క అణకువను అవమానించడం), 323 (బాధ కలిగించడం) కింద అభియోగాలు మోపినట్లు నివేదిక పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆయనను తిట్టిపోస్తున్నారు.. ఇంతటి దుర్మార్గుడా అంటూ చీదరించుకుంటున్నారు.