తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..సరిగ్గా ఆ రోజే..లక్ అంటే ఇదేగా.!!

అమ్మ అని పిలిపించుకోవాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. ప్రతి ఆడపిల్ల ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తుంటుంది. దీనికి హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే తన అందచందాలతో నటనతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్.. తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రెగ్నెన్సి కి సంబంధించిన ఫుడ్, హెల్త్ కేర్, యోగా ఇలా తాను చేసే అన్ని పనులు గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన ప్రెగ్నెన్సీ లోని ప్రతి మూమెంట్ ను ఏంజాయ్ చేస్తుంది.

కాగా, ఈ మధ్యనే బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా తాను తల్లి కాబోతున్న విషయాని అభిమానులతో పంచుకుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తల్లి కాబోతుంది. ఈ విషయాని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకున్నింది. నా లైఫ్ లోనే ది బెస్ట్ గిఫ్ట్ అంటూ..ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు.. అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కన్నడ బ్యూటీ ప్రణితా సుభాష్.

ప్రముఖ కన్నడ నటి ప్రణితా సుభాష్ తల్లి కాబోతోంది. తాను గర్భం దాల్చినట్లు ప్రణితా సుభాష్ సోషల్ మీడియాలో వెల్లడించింది.గతేడాది బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రణీత.. తన భర్త 34 వ పుట్టినరోజు నాడు ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకోవడం చాలా హ్యాపీ గా ఉందంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో ఆమె ప్రెగ్నెన్సీ టెస్ట్ కు సంబంధించిన రిజల్ట్ చూపిస్తూ..భర్తను ప్రేమగా ముద్దాడుతూ..గుడ్ న్యూస్ అంటూ షేర్ చేసుకుది. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్టార్ సెలబ్రిటీలు ప్రణిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా మీలాంటి అందమైన పాపమీకు పుట్టాలి మేడమ్ అంటూ విష్ చేస్తున్నారు.