టైం కలిసి వచ్చుంటే నదియా ఆ స్టార్ హీరోకి తల్లి గా ఉండేదట..?

నదియా..55 వయసు లో ను 30 లా కనిపిస్తూ..హీరోయిన్స్ కన్నా అందంగా తయారైంది. ఒకప్పుడు హీరోయిన్ గా తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ హీరో, హీరోయిన్ల కి అత్తగా, అమ్మగా నటిస్తూ సెకండ్ ఇన్నింగిస్ లో కూడా బిజీ బిజీ గా మారిపోయింది. ఇప్పటికి తెర పై నదియా బొమ్మ పడగానే “వావ్” అనిపించే కామెంట్లు వినిపిస్తుంటాయి. అంత పర్ ఫెక్ట్ ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తుంది ఈ సీనియర్ ఆంటీ హీరోయిన్. మిర్చి లో సినిమా లో ప్రభాస్ తల్లి గా మెప్పించిన ఈ బ్యూటీ.. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కి అత్తగా జీవించేసింది.

ఇక ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లోనే వచ్చిన అ ఆ సినిమాలో సమంత కు తల్లిగా..నితిన్ కు అత్తగా మరో సారి తన యాక్టింగ్ స్కిల్స్ తో అభిమానులను కట్టిపడేసింది. అయితే ఇంత మంది స్టార్స్ కు తల్లి గా నటించిన నదియా.. ఓ హీరో కి మాత్రం తల్లి గా నటించను అని తెగేసి చెప్పేసిందట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు . యస్.. ఇండస్ట్రీలో అందరు అదే అంటున్నారు. మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది సైలెంట్ హిట్ గా నిలిచిన చిత్రం “స్పైడర్”. ఈ సినిమా లో మహేష్ నటన బాగుందని చాలా మంది స్టార్స్ మెచ్చుకున్నారు.

ఈ సినిమా ని డైరెక్ట్ చేసిన మురగదాస్..మహేష్ కు తల్లిగా ఈ మూవీ లో మొదట నదియానే అనుకున్నారట. ఈ విషయం మహేష్ కు చెప్పితే..ఆమె బాగుంటుంది ఈ రోల్ కి అని కూడా అన్నారట. ఇదే విషయాని నదియాకి అప్రోచ్ అయ్యి చెప్పగా..”సారీ, మహేష్ సినిమాలో నటించాలని నాకు ఉంది. కానీ, సినిమా లో తల్లి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. నాకు అంతగా నచ్చలేదు. వేరే స్టోరీ ని ట్రై చేద్దాం”అంటూ ఫేస్ మీదనే చెప్పేసిందట . అలా ఈ సినిమాలో మహేష్ కు తల్లి గా చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది నదియా. మరీ వీళ్ల కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..చూడాలి,..?