సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన కృతిశెట్టి..పాప స్పీడ్ తట్టుకోలేం రా బాబోయ్..

కృతిశెట్టి..టాలీవుడ్ అదృష్ట దేవత. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో..అప్పటి నుండి అదృష్ట దేవత..ఆమెను విడిచి రాను అంటుంది. ఫెవికాల్ వేసిన్నట్లు ఆమెనే పట్టుకుని ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమా లు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన, నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన శ్యామ్ సింగరాయ్ ..మూడోది ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య తో కలిసి బంగార్రాజు సినిమాలో నటించి అద్దిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్లు సాధించింది.

ఇన్ని హిట్ సినిమాలు పడ్డాక పాప రేంజ్ ఎలా ఉంటుంది..ఓ రేంజ్ లో మారిపోదు..ఇలాంటి అదృష్ట దేవతను మన డైరెక్టర్ విడిచిపెడతారా.. నో ఛాన్స్..ముందే అమ్మడు కాల్షీట్లని కూడా బుక్ చేసుకునేశారు. ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ చేతిలో దాదాపు అరడజనుకి పైగా నే సినిమాలు ఉన్నాయి. క్షణం కూడా తీరిక లేకుండా కమిట్ అయిన సినిమాలు చేసుకుంటూపోయినా మరో మూడేళ్ళు అమ్మడుకి ఏం డొకా లేదు. కానీ, కృతికి కొత్త కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి..అమ్మడు సైన్ చేస్తూనే ఉంది.

రీసెంట్ గా అమ్మడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తనకు హిట్ ఇచ్చిన హీరోతో మరోసారి నటించనుండడం ..అభిమానుల అంచనాలను పెంచేస్తుంది. మెగామేనల్లుడు వైష్ణవ్ తో మరోసారి జతకట్టనుంది బేబమ్మ అంటున్నారు సినీ వర్గాలు. ‘ఉప్పెన’తో ఈ జంట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా చాలా చాలా ఎక్కువే. కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తూ.. ఓ ప్రముఖ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందబోతోందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఉప్పెన సినిమాలో కృతి చీరలో,చుడీదార్స్ లో కనిపిస్తుంది కదా..ఇక్కడ మాత్రం హాట్ మోడ్రెన్ డ్రెస్సుల్లో కనిపిస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో కృతిశెట్టి రోల్ చాలా ఢిఫరెంట్ గా ఉంటుందని..ఖచ్చితంగా వీళ్ల జంట రొమాన్స్ మరోసారి అందరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కృతి నేటి కాలం మోడ్రెన్ యువతి గా..టూ స్పీడ్ ఉన్న గార్ల్ గా కనిపించనున్నారట. ఓ క్యూట్ రొమాంటిక్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా పై పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్.