మంచు విష్ణు కు నో చెప్పిన కుర్ర బ్యూటీ..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..?

సాధరణంగా చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చిన కొన్ని అవకాశాలని వదులుకుంటుంటారు. కాల్ షీట్లు ఖాళీ లేక కావచ్చు..రెమ్యూనరేషన్ సరిపోక కావచ్చు.. ఆ కధ నచ్చకపోవచ్చు..రీజన ఏదైన కానీ వచ్చిన డైరెక్టర్స్ కి ఫేస్ మీదనే నో చెప్పే హీరోయిన్లు చాలా తక్కువ . అందులోను మన టాలీవుడ్ లో అలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు సాయి పల్లవి మాత్రమే చేసిందట. తనకు పాత్ర నచ్చకపోతే సారీ..నాకు క్యారెక్టర్ నచ్చలేదంటూ స్మైల్ తోనే చెప్పుతుందట.

కానీ ఇక్కడ ఓ హీరోయిన్..నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చి..వరుస హిట్ సినిమాలు పడే సరికి కళ్లు ఒళ్లు తెలియకుండా బీహేవ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్లతో సమానంగా పారితోషకం డిమాండ్ చేయడమే కాకుండా.. చిన్న పెద్ద తెడాలేకుండా ప్రవర్తిస్తుందట. మొన్నటికి మొన్న సెట్ లో సరదాగా అందరు నవ్వుతూ మాట్లాడుతూ తన పై సెటైర్ వేసే సరికి సదరు కమెడియన్ పై చిరు బురులాడి..తిట్టేసిందట. ఫైనల్ గా మ్యాటర్ ఆ స్టార్ హీరో దగ్గరకు వెళ్లి మరీ చెప్పి ..ఏడ్చిందట.

ఇక ఇప్పుడు.. మంచు విష్ణు లాంటి హీరో తో నటించే ఛాన్స్ వస్తే వదులుకుందట. పోనీ, కధ నచ్చకపోయినా ప్రాబ్లం లేదు..రిజెక్ట్ చేసిన తప్పు లేదు. కానీ స్టోరీ చెప్పడానికి వెళ్ళిన డైరెక్టర్ ఫేస్ మీదనే “మీ హీరోతో చేయడం నాకు ఇష్టం లేదు. వేరే హీరో అయితే నేను రెడీ. నాకు కధ బాగా నచ్చింది”..అంటూ చెప్పేసరికి డైరెక్టర్ నోట మాట రాలేదట. దెబ్బకి సైలెంట్ గా బయటకి వచ్చేశాడట. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడంతో మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రజెంట్ బయట మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసే వాళ్లు..ఈ మ్యాటర్ విని నవ్వుకుంటున్నారట. చివరికి యంగ్ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసే స్దాయి కి వచ్చావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్ ప్లేస్ లో కత్తిలాంటి ఫిగర్ ని తీసుకొచ్చి పెట్టారట మంచు విష్ణు. మరి చూడాలి ఈ కత్తి ఎంత మందికి గురి పెడుతుందో..?

Share post:

Popular